Rajinikanth | సూపర్ స్టార్ రజినీకాంత్ పుట్టిన రోజు సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు Long Live Rajinikanth అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఆయనెప్పుడూ ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నారు. అయితే ఈ మధ్య కాలంలో వయసును కూడా పట్టించుకోకుండా వరస సినిమాలు చేస్తూనే ఉన్నాడు సూపర్ స్టార్. కొన్నేళ్లుగా నెక్ట్స్ ఏంటి అనే ఆలోచనలే లేకుండా వరస సినిమాలు చేస్తూ వచ్చిన రజినీకాంత్‌కు తొలిసారి చాలా ఏళ్ల తర్వాత ఆ ప్రశ్న ఎదురైంది. నెక్ట్స్ ఏంటి అనేది ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు.
2021 డిసెంబర్ 12తో 71లోకి అడుగు పెట్టాడు రజినీకాంత్. మొన్నటి వరకు ఏ మాత్రం తీరిక లేకుండా సినిమాలు చేశాడు రజినీ. కానీ ఇప్పుడు అలా కాదు.. కొన్ని రోజులుగా ఆయన ఆరోగ్యం అంతంతమాత్రంగానే ఉంది. మధ్యలో కొన్నిసార్లు అనారోగ్యం పాలవ్వడమే కాకుండా.. అమెరికా వెళ్లి మరీ చికిత్స తీసుకుంటున్నాడు. అయినా కూడా సినిమాలు మాత్రం చేస్తూనే ఉన్నాడు ఈయన. కానీ చాలా రోజుల తర్వాత ఇప్పుడు రజినీ నెక్ట్స్ సినిమాపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఈ మధ్యే పెద్దన్న సినిమాతో వచ్చాడు సూపర్ స్టార్. శివ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం కూడా అంతగా ఆకట్టుకోలేదు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చిన పెద్దన్న తెలుగులో రజినీకాంత్‌కు మరో డిజాస్టర్‌గా నిలిచింది. మరోవైపు తమిళంలో అన్నాత్తే కూడా అంతగా వర్కవుట్ అవ్వలేదు. అక్కడ కూడా 70 శాతం మాత్రమే వసూళ్లు తీసుకొచ్చి ఫ్లాప్‌గానే నిలిచింది.
అనారోగ్యం కారణంగా ఇప్పటి వరకు మరో సినిమా అనౌన్స్ చేయలేదు. ఈ క్రమంలో దేసింగ్ పెరియా స్వామి మాత్రం రజినీకాంత్‌ను కలిసి ఓ కథ చెప్పాడు. దీనిపై అధికారిక సమాచారం మాత్రం రాలేదు. కోకో సినిమాతో ఈయన మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. దాంతోపాటు మరో సినిమా కూడా చేశాడు పెరియస్వామి. రజినీ ఇమేజ్‌కు సరిపోయే ఓ కథ సిద్ధం చేశాడు ఈయన. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈయన ఆ సినిమా చేస్తాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. దాంతో పాటు పేట దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్.. అన్నాత్తే ఫేమ్ శివ కూడా రజినీతో మరో సినిమా చేయడానికి కథలు సిద్ధం చేస్తున్నారు. మరి వీళ్లలో సూపర్ స్టార్ ఎవరికి అవకాశం ఇస్తాడో చూడాలి. ఇప్పటికీ సినిమాకు 50 కోట్లకు పైగానే తీసుకుంటున్నాడు రజినీకాంత్.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Rajinikanth: రజనీకాంత్ బర్త్‌డే.. ఇంటి ముందు అభిమానుల హంగామా
తెలుగు ఓకే.. మిగిలిన భాషల్లో ప్రమోషన్ ఎక్కడ పుష్ప..?
నా సినిమాను ఉచితంగా ఆడిస్తా.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సెన్సేషనల్ కామెంట్స్
అమితాబ్ బచ్చన్ ప్లాట్‌కు కృతిసనన్ ఇచ్చే అద్దె తెలిస్తే షాకే..!
అత్తారింటికి వెళ్తున్న పవన్‌కల్యాణ్..ఎందుకో తెలుసా..?