సూపర్ స్టార్ రజనీకాంత్.. ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఊరు, ప్రాంతం, భాష, భేదం లేకుండా సినీ ప్రేక్షకులు అందరు ఆయనని ఎంతగానో అభిమానిస్తుంటారు. ఆయన నడిస్తే స్టైల్.. కూర్చుంటే స్టైల్.. మాట్లాడితే స్టైల్.. సిగరెట్ తాగితే స్టైల్.. అలా పక్కకు చూసినా స్టైల్.. ఒక్కటేమిటి ఏం చేసినా.. అది స్టైల్. వాటికి జనాలు పిచ్చెక్కినట్టు ఊగిపోతుంటారు. 1950 , డిసెంబర్ 12న మహారాష్ట్రలో జన్మించిన శివాజీ రావ్ గైక్వాడ్.. ఆ తర్వాత రజనీకాంత్‌గా మారాడు.
రజనీకాంత్ చిత్రసీమలో అడుగుపెట్టక ముందు బెంగళూరులో సిటీ బస్ కండక్టర్ గా పనిచేశారు. ఆ సమయంలో ప్రతి రోజూ సెకండ్ షో చూడడం ఆయనకు అలవాటుగా ఉండేదట. రజనీ మాతృభాష మరాఠీ. పెరిగిందేమో కర్ణాటక రాజధాని బెంగళూరులో. కాని ఆయనకు అంతటా అశేష ప్రేక్షకాదరణ ఉండేది. ఇటీవల రజనీకాంత్ అత్యుత్తమ పురస్కారం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ కూడా అందుకున్నారు.
1975 లో బాలచందర్ తెరకెక్కించిన అపూర్వ రాగంగల్ సినిమాతో తొలిసారి తమిళ సినిమాకు పరిచయం అయ్యారు. అదే ఏడాది తెలుగులో తూర్పు పడమరగా విడుదలైంది ఈ చిత్రం. కెరీర్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించి ఎందరో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నరజనీకాంత్ రీసెంట్గా తన 71వ బర్త్ డే జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా ఆయన ఇంటి ముందు అభిమానులు హంగామా చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన పిక్స్ వైరల్‌గా మారాయి.
Tamil Nadu: Fans of Rajinikanth gather outside his residence in Chennai, as the actor celebrates his 71st birthday today pic.twitter.com/5JNElVlxjn
— ANI (@ANI) December 12, 2021