ఆస్కార్ అవార్డ్స్ ఫంక్షన్లో క్రిస్ రాక్ చెంపచెల్లుమనిపించిన విల్‌స్మిత్!..ఈ వ్యాధే కారణం!!
సినిమా అవార్డ్స్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైనవి ఆస్కార్ అవార్డ్స్. వీటినే అకాడమీ అవార్డ్స్ అని పిలుస్తారు. అకాడమీ అవార్డ్స్ ఫంక్షన్ ఈ సారి ఘనంగా జరిగింది. అయితే, ఇందులో ఓ ఘటన మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచింది. అదే విల్‌స్మిత్.. హోస్ట్ క్రిస్‌రాక్ చెంపచెల్లుమనిపించిన ఘటన. ఈ కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరించిన క్రిస్ రాక్.. విల్ స్మిత్ భార్య జాడా పింకెట్‌పై కుళ్లు జోకు వేశాడు. దీంతో విల్‌స్మిత్‌కు కోపమొచ్చింది.
సినిమా అవార్డ్స్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైనవి ఆస్కార్ అవార్డ్స్. వీటినే అకాడమీ అవార్డ్స్ అని పిలుస్తారు. అకాడమీ అవార్డ్స్ ఫంక్షన్ ఈ సారి ఘనంగా జరిగింది. అయితే, ఇందులో ఓ ఘటన మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచింది. అదే విల్‌స్మిత్.. హోస్ట్ క్రిస్‌రాక్ చెంపచెల్లుమనిపించిన ఘటన. ఈ కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరించిన క్రిస్ రాక్.. విల్ స్మిత్ భార్య జాడా పింకెట్‌పై కుళ్లు జోకు వేశాడు. దీంతో విల్‌స్మిత్‌కు కోపమొచ్చింది. వెంటనే సీటులోంచి లేచి స్టేజిపైకి వచ్చి మరీ క్రిస్‌రాక్ చెంపపై కొట్టాడు. ఈ ఘటనతో అక్కడున్నవారంతా షాకయ్యారు. క్రిస్‌రాక్ దీన్ని స్పోర్టివ్‌గా తీసుకున్నా..విల్‌స్మిత్ మాత్రం ఊగిపోయాడు. ఇంకోసారి నా భార్య పేరు ఎత్తకు అంటూ వార్నింగ్ ఇచ్చాడు.
ఇంతకీ ఈ గొడవకు కారణమేంటో తెలుసా? ఓ వ్యాధి..!! అవును మీరు విన్నది నిజమే..అలోపేసియా అనే వ్యాధి వల్ల జాడా పింకెట్ తలవెంట్రుకలు మొత్తం ఊడిపోయాయి. దీంతో ఆమె గుండుతోనే ఆస్కార్ అవార్డ్స్ ఫంక్షన్‌కు హాజరైంది. కాగా, క్రిస్‌రాక్..ఆమెను చూస్తూ జాడా పింకెట్‌ను ‘జీఐ జేన్ 2’లో చూడాలనుకుంటున్నాను అని కామెంట్ చేశాడు. 1997లో రిలీజైన ‘జీఐ జేన్’ చిత్రంలో హీరోయిన్ డెమీ మూర్ గుండుతో కనిపిస్తుంది. అసలే వ్యాధితో బాధపడుతున్న తన భార్యపై క్రిస్‌రాక్ కుళ్లుజోకు వేయడంతో విల్‌స్మిత్‌కు పట్టరాని కోపమొచ్చింది.
అలోపేసియా ఏరియాటా అంటే?
అలోపేసియా అనేది ఆటోఇమ్యూన్ వ్యాధి. ఈ వ్యాధి సోకినవారికి జుట్టు చిన్నచిన్న ప్యాచెస్‌లా రాలిపోతూ ఉంటుంది. వ్యాధి ముదిరితే తలపై జుట్టు మొత్తం రాలిపోతుంది. ఈ వ్యాధి లింగభేదం లేకుండా అందరికీ వస్తుంది. మెడికల్ హెల్త్టుడే ప్రకారం..యునైటెడ్ స్టేట్స్లో ఈ వ్యాధితో దాదాపు 6.8మిలియన్ల మంది బాధపడుతున్నారు.
అలోపేసియా వ్యాధికి కారణాలు, లక్షణాలు..
మన రోగనిరోధక వ్యవస్థ మనల్ని సురక్షితంగా, ఆరోగ్యంగా ఉంచేందుకు పర కణాల (బయటి కణాలు)కు వ్యతిరేకంగా పోరాడుతుంది. అయితే, కొన్ని సందర్భాల్లో ఇది పొరపాటున మన చర్మం అంచున ఉన్న హెయిర్ ఫోలికల్స్‌పై దాడి చేస్తుంది. ఇలాంటప్పుడు జుట్టు రాలడం మొదలవుతుంది, దీని ఫలితంగా అలోపేసియా వ్యాధి సంక్రమిస్తుంది. జుట్టు రాలడం ఈ అలోపేసియా వ్యాధి ప్రధాన లక్షణం. కొందరికి తలపై కాకుండా.. కనుబొమ్మలు, గడ్డంలాంటి ఇతరభాగాలపై వెంట్రుకలు రాలిపోతుంటాయి.
చికిత్స..
ప్రస్తుతం ఈ వ్యాధికి తెలిసిన చికిత్స లేదు. అయితే, జుట్టు పెరుగుదలకు మాత్రం కొన్ని చికిత్సలున్నాయి. స్టెరాయిడ్ ఇంజక్షన్స్ ద్వారా తిరిగి జుట్టును పొందొచ్చు. అలాగే, రోగనిరోధక వ్యవస్థ ప్రతిస్పందనను నిరోధించేందుకు కొన్ని మాత్రలు కూడా ఉన్నాయి. అయితే, వీటిని దీర్ఘకాలం వాడితే దుష్ప్రభావాలుంటాయి.
Will Smith just said, nope. That’s my wife.#Oscars pic.twitter.com/zKk2Gjemuy
— Erik Davis (@ErikDavis) March 28, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

