వరసగా మూడు పరాజయాల తర్వాత గజిని మహమ్మద్‌లా బాక్సాఫీస్ పైకి మరోసారి దండయాత్రకు వస్తున్నాడు అఖిల్ అక్కినేని (Akhil Akkineni). ఈయన తాజాగా నటిస్తున్న సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ (Most Eligible Bachelor). ఈ సినిమాపై ముందు నుంచి కూడా ఆసక్తి బాగానే ఉంది. వరస ఫ్లాపుల్లో ఉన్న బొమ్మరిల్లు భాస్కర్ ను నమ్మి నాగార్జున, అల్లు అరవింద్ ప్రాజెక్ట్ ఇచ్చారంటే సినిమాలో ఎంత దమ్ము ఉందో అని అక్కినేని ఫ్యాన్స్ కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా చూస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ పై ఇప్పటికీ క్లారిటీ లేదు. జూన్ 19న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నా కూడా కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. ఆ తర్వాత మళ్లీ విడుదల తేదీపై స్పష్టత రాలేదు.
పూజా హెగ్డే (Pooja Hegde) ఇందులో అఖిల్ కు జోడీగా నటిస్తుంది. మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ బిజినెస్ కూడా బాగానే చేస్తుంది. భలే భలే మగాడివోయ్, పిల్లా నువ్వులేని జీవితం, గీత గోవిందం, ప్రతిరోజు పండగే లాంటి బ్లాక్‌బస్టర్ సినిమాలతో మోస్ట్ సక్సెస్ ఫుల్ నిర్మాతగా క్రేజ్ సొంతం చేసుకున్న బన్నీ వాసు, జోష్ దర్శకుడు వాసు వర్మతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాడు. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ ప్రకటించిన రోజు నుంచి కూడా ఈ సినిమాపై అక్కినేని అభిమానుల్లో ఆసక్తి మొదలైంది.
ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ టీం విడుదల చేసిన అఖిల్ అక్కినేని ఫస్ట్ లుక్కు, అలానే గోపీ సుందర్ సంగీత సారధ్యంలో హ్యాపెనింగ్ స్టార్ సింగర్ సిద్ శ్రీరామ్ పాడిన మనసా మనసా పాటకు, ఆ తర్వాత విడుదల చేసిన టీజర్‌కు అటు సోషల్ మీడియాలో ఇటు అభిమానుల్లో అనూహ్యమైన స్పందన లభించడం యూనిట్లో కొత్త ఉత్సాహన్ని తెచ్చింది. సినిమాకు మంచి హైప్ ఉన్నా కూడా ఇప్పటి వరకు రిలీజ్ డేట్ పై క్లారిటీ లేకపోవడంతో అభిమానులు కాస్త నిరాశలో ఉన్నారు.
ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను దసరాకు విడుదల చేయాలని చూస్తున్నారు. దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ కు కూడా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ కీలకంగా మారింది. తొలి సినిమా తర్వాత ఇప్పటి వరకు మళ్లీ ఆ స్థాయి విజయం లేని ఈ దర్శకుడికి ఈ సినిమా చావో రేవో తేల్చనుంది. మరోవైపు అఖిల్ పరిస్థితి కూడా ఇంచుమించు ఇంతే.
ఇవికూడా చదవండి..
Seetimaarr |ఈల వేసేందుకు గోపీచంద్ రెడీ..సీటీమార్ రిలీజ్ డేట్ ఫిక్స్
Chiranjeevi |ముఠామేస్త్రి స్టైల్ లో చిరంజీవి..షేర్ చేసిన బాబీ
Bandla Ganesh | ఇంట్రెస్టింగ్ అప్డేట్..హీరోగా బండ్లగణేశ్..!