‘వ్యాపారరంగంలో ఉన్న నేను, ముందు ఓ చిన్న బడ్జెట్ సినిమా చేయాలనుకున్నాను. ఈ కథ విన్న తర్వాత నా ఆలోచనలో మార్పు వచ్చింది. డైరెక్టర్ మారుతిని కలిస్తే, ఆయన ‘తీస్తే బాగా తీయండి.. లేదంటే లేదు..’ అన్నారు. దాంతో భారీ ఎత్తునే సినిమా నిర్మించాలని ఫిక్సయ్యాం.’ అని నిర్మాత విజయ్ పాల్‌రెడ్డి అన్నారు. ఆయన నిర్మించిన ‘త్రిబాణధారి బార్బరిక్’ చిత్రం ఈనెల 29న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత విజయ్‌పాల్‌రెడ్డి సోమవారం హైదరాబాద్‌లో విలేకరులతో ముచ్చటించారు. ‘ఇది కొత్తరకమైన కథ. థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ఈ కథలో మైథలాజికల్ జానర్ కొత్తగా ఉంటుంది. వరంగల్, విజయవాడల్లో సీక్రెట్ ప్రీమియర్లు వేశాం. అద్భుతమైన స్పందన వచ్చింది. సినిమాను చూసిన చాలామంది కన్నీళ్లు పెట్టుకున్నారు. అద్భుతంగా ఉందని పొగుడుతున్నారు. ఆడియన్స్ ప్రస్తుతం కొత్త కంటెంట్‌నే ఇష్టపడుతున్నారు. ఈ సినిమా కథాపరంగానే కాదు, సాంకేతికంగా కూడా కొత్తగా ఉంటుంది. అగ్ర దర్శకుడు మారుతీ ఎంతో సహకారం అందించారు. సత్యరాజ్.. తన కెరీర్లో ఇప్పటివరకూ పోషించనటువంటి పాత్రను ఇందులో పోషించారు. ఉదయభాను విలన్‌గా నటించారు. సత్యం రాజేష్, వశిష్ట, సాంచీరాయ్ అందరి పాత్రలూ ఆకట్టుకుంటాయి.’ అని నిర్మాత విజయ్‌పాల్‌రెడ్డి తెలిపారు.