ఈ వీకెండ్ ఓటీటీ ప్రియులకు పండగే అని చెప్పాలి. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, జియోహాట్‌స్టార్ వంటి ప్రముఖ ప్లాట్‌ఫారమ్‌లలో ఈ వీకెండ్ పెద్ద సినిమాలు, సిరీస్‌లు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే అవి ఏంటి అనేది చూసుకుంటే.!
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)
డెకాయిట్ (Dacoit): అడవి శేష్, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ యాక్షన్ డ్రామా ప్రస్తుతం ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది.
లుక్కే (Lukkhe): పంజాబీ రాప్ సంగీతం నేపథ్యంలో సాగే మ్యూజికల్ యాక్షన్ డ్రామా.
నో ప్లేస్ టు బి సింగిల్ (No Place to be Single): ఇటలీలోని టస్కానీ నేపథ్యంలో సాగే ఒక ఆహ్లాదకరమైన రొమాంటిక్ కామెడీ.
సైతాన్ ది డార్క్ (Satan The Dark): ఒక హర్రర్ థ్రిల్లర్ మూవీ (తమిళం).
జియో హాట్‌స్టార్ (JioHotstar)
వాళ 2 (Vaazha 2 – Biopic of a Billion Bros): మలయాళంలో ఘనవిజయం సాధించిన ఈ కామెడీ డ్రామా ఇప్పుడు స్ట్రీమింగ్ అవుతోంది. (తెలుగు, మలయాళం, హిందీ, తమిళం, కన్నడ).
M.I.A.: ఫ్లోరిడా డ్రగ్ బిజినెస్ నేపథ్యంలో సాగే ఒక పవర్ఫుల్ క్రైమ్ డ్రామా సిరీస్.
సాంగ్ సంగ్ బ్లూ (Song Sung Blue): హ్యూ జాక్మన్, కేట్ హడ్సన్ నటించిన హృద్యమైన మ్యూజికల్ డ్రామా.
నెట్‌ఫ్లిక్స్ (Netflix)
భరతనాట్యం 2 – మోహినియాట్టం (Bharathanatyam 2): తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది.
మై రాయల్ నెమిసిస్ (My Royal Nemesis): కొరియన్ ఫాంటసీ రొమాన్స్ డ్రామా.
ఇతర ప్లాట్‌ఫారమ్‌లు
జీ5 (Zee5): లవ్ మాక్‌టెయిల్ 3 (Love Mocktail 3) – కన్నడ రొమాంటిక్ డ్రామా.
సన్ నెక్స్ట్ (SunNxt): ఓ బటర్ ఫ్లై (Oh Butterfly – తమిళం) మరియు సూపర్‌హిట్ (Superhit – కన్నడ).
సింప్లీ సౌత్ (SimplySouth): వాళ 2 (Vaazha 2).