శ్రీ, ప్రియా దేషపాగ జంటగా నటిస్తున్న ‘వీకెండ్’ సినిమా షూటింగ్ బుధవారం ఏపీలోని చీరాలలో మొదలైంది. బి.రాము దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఖడ్గధార మూవీస్ పతాకంపై భారతి నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి అజయ్‌ఘోష్ క్లాప్‌నిచ్చారు. ‘క్రైమ్ థ్రిల్లర్ కథాంశమిది. కథ, కథనాలు చాలా కొత్తగా ఉంటాయి. ఓ జంట జీవితంలో వీకెండ్ సమయంలో జరిగిన అనూహ్య సంఘటనలేమిటన్నదే చిత్ర ఇతివృత్తం. మొదటి షెడ్యూల్ మొత్తం చీరాలలోనే జరుపుతాం’ అని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: యూఎస్ విజయ్, సంగీతం: ఎన్.అర్జున్, రచన-దర్శకత్వం: రాము.బి.