Allu Aravind | శ్రీతేజ్‌కు అల్లు అరవింద్ పరామర్శ.. మహిళ కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ
Allu Arjun | ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్లో డిసెంబర్ 4న రాత్రి పుష్ప 2 ది రూల్ (Pushpa 2 The Rule) బెనిఫిట్ షో నేపథ్యంలో అల్లు అర్జున్ రాక సందర్భంగా తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో రేవతి (39) అనే మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ (9)కు గాయాలయ్యాయి. ప్రస్తుతం శ్రీతేజ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ తండ్రి, నిర్మాత అల్లు అరవింద్ కిమ్స్ ఆస్పత్రికి వెళ్లారు. శ్రీతేజ్‌ను పరామర్శించి అతని ఆరోగ్యపరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం శ్రీతేజ కుటుంబసభ్యులతో మాట్లాడారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ.. మృతి చెందిన మహిళ కుటుంబాన్ని పూర్తిగా ఆదుకుంటామన్నారు. ప్రభుత్వం మాకు పూర్తి స్థాయిలో సహకారం అందించింది. కేసు కోర్టులో ఉన్నందున అల్లు అర్జున్ రాలేకపోయారు. అల్లు అర్జున్ తరపున నేను ఆస్పత్రికి వచ్చానని స్పష్టం చేశారు.
ఇప్పటికే జైలు నుంచి విడుదలైన సందర్భంగా అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడుతూ.. సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటన దురదృష్టకరమని.. బాధిత కుటుంబానికి జరిగిన నష్టం పూడ్చలేనిదన్నాడు. ఆ కుటుంబానికి మరోసారి నా క్షమాపణలతో పాటు సానుభూతి తెలుపుతున్నా. బాధిత కుటుంబానికి ఎల్లప్పుడు అండగా ఉంటాను. నేను సినిమా చూసేందుకు వెళ్లినప్పుడు అనుకోకుండా ఈ ఘటన జరిగిందని.. ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదన్నాడు.
Read Also :
Vijay Sethupathi | టాలీవుడ్ డెబ్యూకు విజయ్ సేతుపతి రెడీ.. ఇంతకీ డైరెక్టర్ ఎవరో మరి..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!