కాంట్రాక్టర్లు ‘చలో హైదరాబాద్’ విరమించుకోవాలి
రాష్ట్రంలో తెలంగాణ బిల్డర్లు, కాంట్రాక్టర్లు గురువారం తలపెట్టిన ‘చలో హైదరాబాద్'ను విరమించుకోవాలని ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విజ్ఞప్తిచేశారు. బిల్డర్లు, కాంట్రాక్టర్లతో మంగళవారం మంత్రుల నివాస సముదాయంలోని క్యాంపు కార్యాలయంలో సమావేశమైన ఆయన వారి సమస్యలపై చర్చించారు.
- మూడు నెలల్లోగా పెండింగ్ బిల్లులు చెల్లిస్తాం : కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
హైదరాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో తెలంగాణ బిల్డర్లు, కాంట్రాక్టర్లు గురువారం తలపెట్టిన ‘చలో హైదరాబాద్’ను విరమించుకోవాలని ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విజ్ఞప్తిచేశారు. బిల్డర్లు, కాంట్రాక్టర్లతో మంగళవారం మంత్రుల నివాస సముదాయంలోని క్యాంపు కార్యాలయంలో సమావేశమైన ఆయన వారి సమస్యలపై చర్చించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రోడ్లు, వంతెనలు, అత్యవసర మరమ్మతుల పనులు నిరంతరం కొనసాగాల్సిన అవసరం ఉందని, ఈ సమయంలో సమ్మె, ఆందోళనలు చేస్తే ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతాయని ఆందోళన వ్యక్తంచేశారు. మూడు, నాలుగు రోజుల్లో కాంట్రాక్టర్ల సమస్యలపై సమగ్రంగా చర్చిస్తామని హామీఇచ్చారు.
పథకాల ప్రచారంలో కళాకారులే కీలకం : జూపల్లి
హైదరాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లడంలో సాంస్కృతిక కళాకారులే కీలకమని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం రవీంద్రభారతిలో తెలంగాణ భాషా సాంసృతికశాఖ ఆధ్వర్యంలో కళాకారులకు గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జూపల్లి కృష్ణారావు ప్రజా కళాకారుడు, తెలంగాణ ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె నరసింహకు మొదటి గుర్తింపు కార్డును అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కళాకారులకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

