తెలుగు, తమిళ ప్రేక్షకులకు సుపరిచితుడైన కార్తీ (Karthi) పీఎస్ మిత్రన్ (PS Mithran) డైరెక్షన్లో చేస్తున్న చిత్రం సర్దార్ (Sardar). స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం అక్టోబర్ 21న విడుదలవుతుంది. తెలుగు, తమిళంతోపాటు వివిధ భాషల్లో విడుదల చేస్తున్నారు.
ఇవాళ జరిగిన సర్దార్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అక్కినేని నాగార్జున ముఖ్యఅతిథిగా హాజరయ్యాడు. ఈవెంట్లో నాగార్జున ఆల్ టైమ్ ఫేవరేట్ హిట్ ఆల్బమ్‌లో నుంచి కన్నుల్లో నీ రూపమే..గుండెల్లో నీ ధ్యానమే..నా ఆశ నీ స్నేహమే..నా శ్వాస నీకోసమే పాట పాడి..ఈవెంట్‌కు వచ్చిన వారిలో జోష్ నింపాడు కార్తీ. ఈ రోజు చాలా ప్రత్యేకం. అన్నయ్య వచ్చాడు. నాగార్జునగారు నాకు ఎప్పుడూ ఇన్స్పిరేషన్. ఫిలింఫేర్ మ్యాగజైన్లో ఆయన చెప్పిన విషయమొకటి చదివాను..మంచి యాక్టర్‌గా ఉండాలంటే.. మంచి హ్యూమన్ బీయింగ్‌గా ఉండాలి..అలా అయితేనే మంచి నటుడు అవ్వొచ్చని నాగార్జున చెప్పారు. నేనప్పుడు 10వ తరగతి చదువుతున్నా..నాకింకా గుర్తుంది. ఊపిరి ఒప్పుకోవడానికి మొదటి కారణం ఆ సినిమాలో నాగార్జున ఉన్నారనేనన్నాడు కార్తీ.
సినీ కెరీర్లో ప్రతీ సినిమా తీసేటపుడు ఒక జ్ఞాపకం ఉంటుంది. అందులో చాలా ఫేవరేట్.. ఊపిరి సినిమా షూటింగ్ టైంలో
నాగార్జునతో కలిసి ఉక్రెయిన్‌లో సినిమాలు చూశాం. డిన్నర్‌కు వెళ్లాం, వర్కవుట్స్ చేశాం. అది గోల్డెన్ మెమోరీ. ఆ జ్ఞాపకాలను ఎప్పటికీ మరిచిపోలేను. నాగార్జున సర్దార్ తెలుగు వెర్షన్‌ను విడుదల చేస్తున్నారని తెలిసి చాలా థ్రిల్ అయ్యాం. నా కెరీర్లో సర్దార్ చాలా ముఖ్యమైన సినిమా అంటూ చెప్పుకొచ్చాడు.