‘కల్కి 2898’ కథ ఓ ప్రత్యేకమైన ప్రపంచంలో నడుస్తుందని, ఈ సినిమాలో ఇండియాలోని ఫ్యూచర్ సిటీలు ఎలా ఉంటాయో చూపించబోతున్నామని చెప్పారు చిత్ర దర్శకుడు నాగ్అశ్విన్. ప్రభాస్ కథానాయకుడిగా వైజయంతీ మూవీస్ తెరకెక్కిస్తున్న ‘కల్కి’ చిత్రం దేశవ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నది. ఈ నేపథ్యంలో ముంబయి ఐఐటీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న నాగ్అశ్విన్ సినిమా విశేషాలను తెలిపారు. ఆయన మాట్లాడుతూ ‘ఈ సినిమా కోసం ఐదేళ్లుగా శ్రమిస్తున్నాం. ప్రతి అంశాన్ని లోతుగా ఆలోచించి ఓ కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేశాం.
ఇందులో ఉపయోగించిన సాంకేతికత, ఆయుధాలు, ట్రోప్స్, కాస్ట్యూమ్స్..ఇలా ప్రతీది భారతీయ సాంస్కృతిక మూలాలతో ముడిపడి ఉంటుంది. ఇప్పుడున్న టెక్నాలజీ, వాడుతున్న ఆయుధాలు భవిష్యత్తులో ఎలా మార్పు చెందబోతున్నాయో చూపించాం. ఇది ప్రేక్షకులను థ్రిల్‌కు గురిచేస్తుంది. ప్రభాస్, అమితాబ్‌బచ్చన్, దీపికా పడుకోన్ ఇప్పటివరకు చేయనటువంటి పాత్రల్లో కనిపిస్తారు’ అని నాగ్అశ్విన్ తెలిపారు. సినిమా టైటిల్ అర్థమేమిటనే అంశాన్ని రిలీజ్‌కు ముందు చెబుతానని ఆయన అన్నారు. ఈ సినిమాలో ప్రభాస్ మేకోవర్ చాలా కొత్తగా ఉంటుందని, ‘కల్కి’లో ఫ్యూచర్ ప్రభాస్‌ను చూస్తారని, త్వరలో రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తామని నాగ్అశ్విన్ పేర్కొన్నారు.