Hanuman | ఓం రౌత్ డైరెక్షన్లో ప్రభాస్ టైటిల్ రోల్ పోషించిన చిత్రం ఆదిపురుష్(Adipurush ) . పురాణేతిహాసం రామాయణం దృశ్యకావ్యాన్ని అత్యాధునిక హంగులను జోడించి తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబడుతోంది. అయితే మరోవైపు ఆదిపురుష్‌కు అభ్యంతరాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
సినిమాలో వినియోగించిన 2డీ గ్రాఫిక్స్‌ను పక్కనపెడితే మోడ్రనైజేషన్ పేరుతో రామాయణాన్ని ట్యాంపరింగ్ చేశారని, వాల్మీకి ఒరిజినల్ రామాయణ కావ్యాన్ని చాలా సన్నివేశాల్లో మార్చారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రత్యేకించి ఆదిపురుష్ లో రావణుడి పాత్రను మార్చేసి పూర్తిగా డార్క్ షేడ్స్ లో చూపించారని ప్రేక్షకులు ఈ మార్పులను జీర్ణించుకోలేకపోతున్నారని, ఈ మార్పులతో రామాయణంలోని నిజమైన సారాంశాన్ని దెబ్బతీశారని ఆరోపిస్తున్నారు.
అయితే ఆదిపురుష్‌పై వస్తున్న విమర్శలు మరో మైథలాజికల్ డ్రామా హనుమాన్ (Hanuman) పై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ లీడ్ రోల్లో నటిస్తున్న చిత్రం హనుమాన్. ఒకవేళ హనుమాన్ సినిమా కూడా లార్డ్ హనుమాన్ మోడ్రనైజేషన్ వెర్షన్ అయితే ఎలా అని ఆలోచనలో పడ్డారు. ఈ నేపథ్యంలో పుకార్లన్నింటిని కొట్టిపారేశాడు ప్రశాంత్ వర్మ.
హనుమాన్ పాత్రను మోడ్రనైజింగ్ చేసే రిస్క్ చేయలేదని చెప్పాడు. హనుమాన్ మనకు చిన్నతనం నుంచి తెలియజేసిన ఆంజనేయుడని, ఈ పాత్ర కోసం తన టీం ఏడాదికి పరిశోధన చేసిందని చెప్పుకొచ్చాడు ప్రశాంత్ వర్మ . హనుమాన్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.
హనుమాన్ టీజర్.. వీడియో