WAR 2 | మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ “వార్ 2”. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన “దేవర” సినిమాతో ఆకట్టుకున్న తారక్, ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీతో మరోసారి తన క్రేజ్‌ను చాటాడు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విడుదలకి ముందే భారీ అంచనాలు నెలకొన్నాయి.ఎన్టీఆర్ మొదటిసారి బాలీవుడ్లో నటించటం, అలాగే హృతిక్ రోషన్‌తో స్క్రీన్ షేర్ చేయటం సినిమాపై భారీ హైప్‌ని తీసుకొచ్చింది. కానీ, విడుదలైన తర్వాత మాత్రం సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. అయినప్పటికీ తారక్ క్రేజ్ వల్లే సినిమా మంచి కలెక్షన్లు రాబట్టింది.
ఆగస్టు 14న విడుదలైన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ఇప్పుడు ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే సోషల్ మీడియాలో “వార్ 2” ఓటీటీ రిలీజ్ గురించి వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం, ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమాకు డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. సినిమాను సెప్టెంబర్ 12, 2025 నుండి స్ట్రీమింగ్ చేయనున్నట్లు సమాచారం. యశ్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్‌లో ఇది ఆరవ భాగం. తారక్, హృతిక్ రోషన్ల మధ్య వచ్చే యాక్షన్ సీన్స్ సినిమాకే హైలైట్‌గా నిలిచాయి. థియేటర్లో మిస్ అయిన వారు, లేదా మరోసారి తారక్ యాక్షన్ చూసే ఆసక్తి ఉన్నవారు ఓటీటీలో ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేయండి.
ఇక ఎన్టీఆర్ ఇప్పుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని రూపొందిచనున్నారు. ఈ సినిమాతో ఎన్టీఆర్ భారీ హిట్ కొడతాడని అందరు భావిస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ లైనప్‌లో చాలానే సినిమాలు ఉన్నాయని టాక్ వినిపిస్తుంది.