WAR 2 | జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ చిత్రంగా రూపొందిన భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘వార్ 2’ ఇటీవల థియేటర్లలో విడుదలై మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నా, బాక్సాఫీస్ వద్ద మాత్రం కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇప్పటివరకు ఈ చిత్రం రూ.300 కోట్లకుపైగా వసూళ్లు సాధించి మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా, ఈ సినిమా ఓటీటీలోకి వస్తుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతున్న సమాచారం ప్రకారం, వార్ 2 స్ట్రీమింగ్ హక్కులు నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. అధికారిక ప్రకటన ఇంకా వెలువడనప్పటికీ, ఈ చిత్రం 2025 అక్టోబర్ 9 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నదని టాక్ వినిపిస్తోంది. హిందీతో పాటు తెలుగు, ఇతర భాషల్లో కూడా విడుదలయ్యే అవకాశముంది.
మరి కొందరు దసరా పండగ కానుకగా అక్టోబర్ 01 నుంచి ఎన్టీఆర్, హృతిక్ ల మూవీ నెట్ ఫ్లిక్స్ లోకి రానుందని అంటున్నారు. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది. వార్ 2 సినిమాలో ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు హృతిక్ రోషన్, కియారా అద్వానీ, అశుతోష్ రానా, అనిల్ కపూర్, అరీస్టా మెహతా తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సంగీతాన్ని ప్రీతమ్, సంచిత్ బాలహారా, అంకిత్ బాలహారా అందించారు.
యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించిన ఈ చిత్రం స్పై యూనివర్స్‌లో భాగంగా రూపొందింది. హై-ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్‌లు, పవర్ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, స్టార్ స్టడెడ్ కాస్ట్ ‘వార్ 2’కి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మొత్తానికి, థియేటర్లలో రికార్డ్ స్థాయిలో ఓపెనింగ్ సాధించిన ‘వార్ 2’ , ఇప్పుడు ఓటీటీలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. కానీ నిజంగా అక్టోబర్ 9న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందా లేదా అన్నది అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ వేచి చూడాల్సిందే. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ఎన్టీఆర్ డ్రాగన్ అనే సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ మూవీ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.