Rashmika-Vijay | టాలీవుడ్ క్రేజీ జంట విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న గత కొద్ది రోజులుగా వార్తలలో నిలుస్తున్నారు. ఈ జంట ప్రేమలో ఉన్నారన్న వార్తలు చాలాకాలంగా వినిపిస్తున్నా, ఇద్దరూ అధికారికంగా ఎప్పుడూ స్పందించలేదు. అయితే వారి సోషల్ మీడియా పోస్టులు, వెకేషన్ పిక్స్ ద్వారా పలుమార్లు హింట్స్ ఇచ్చారు. ఇటీవల ఈ జంట సైలెంట్‌గా నిశ్చితార్థం చేసుకున్నారని టాలీవుడ్లో జోరుగా ప్రచారం జరిగింది. నిశ్చితార్థం తర్వాత వీరిద్దరూ కలిసి పబ్లిక్‌గా కనిపించకపోవడంతో అభిమానులు ఎప్పడు కలిసి కనిపిస్తారా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు రష్మిక నటించిన ‘ది గర్ల్‌ఫ్రెండ్’ సినిమా సక్సెస్ మీట్‌కు విజయ్ దేవరకొండ గెస్ట్‌గా హాజరుకానున్నారని సమాచారం.
అధికారికంగా ప్రకటించకపోయినా ఈ విషయం ఇప్పటికే టాలీవుడ్ వర్గాల్లో హల్చల్ సృష్టిస్తోంది. ఈవెంట్లో రష్మిక, విజయ్ ఒకే వేదికపై కనిపించడం ఖాయం అని చెప్పుకోవచ్చు. ఫ్యాన్స్ మాత్రం ఈ ఈవెంట్ కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. వీరు తమ నిశ్చితార్థం గురించి మాట్లాడతారని, లేక పెళ్లి తేదీపై ఏదైనా హింట్ ఇస్తారేమో అని నెటిజన్లు ఊహాగానాలు చేస్తున్నారు. ఇక ఈవెంట్లో రష్మిక – విజయ్ ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే చాలు, ఆ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవడం ఖాయం. టాలీవుడ్లో అత్యంత పాపులర్ కపుల్‌గా పేరొందిన ఈ జంట నుంచి ఫ్యాన్స్ ఇప్పుడు ఒక్క క్లిక్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చూడాలి మరి .. నేడు జరిగే ఈవెంట్లో రష్మిక – విజయ్ దేవరకొండ ఎలాంటి సర్ప్రైజ్ ఇస్తారో!
ఇక రష్మిక నటించిన ది గర్ల్ ఫ్రెండ్ సినిమా కథ విషయానికి వస్తే.. భూమా (రష్మిక మందన్న) పీజీ చేయడానికి హైదరాబాద్ లోని ఓ కాలేజ్ లో జాయిన్ అవుతుంది. అదే కాలేజ్ లో పీజీ చేయడానికి వచ్చిన విక్రమ్ (దీక్షిత్ శెట్టి) భుమాని చూసి ఇష్టపడతాడు. ఒక బలహీనమైన క్షణంలో భూమా కూడా విక్రమ్ ని ఇష్టపడుతుంది. విక్రమ్ కి జెలసీ, పోసిస్సివెన్స్ ఎక్కువ. తనది పాత కాలం మనస్తత్వం. విక్రమ్ తో రోజులు గడుపుతున్నకొద్ది భూమాకి కొన్ని విషయాలు అర్ధమౌతూవస్తుంటాయి. రిలేషన్షిప్ లో ఓ చిన్న బ్రేక్ కావాలని ఆడుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? విక్రమ్ ఎలా రియాక్ట్ అయ్యాడు ? ఈ కథలో దుర్గా (అను ఇమ్మానుయేల్) పాత్ర ఏమిటి? చివరికి భూమా ఎలాంటి నిర్ణయం తీసుకుందనేది మిగతా కథ.