Hanu Ragavapudi | ప్రేమ కథలను అందంగా తెరకెక్కించడంలో హను రాఘవపూడి సిద్ధహస్తుడు.’అందాల రాక్షసి’ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతో ప్రేక్షకులలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రస్తుతం ఈయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ చిత్రం ‘సీతారామం’. దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో మృనాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తుంది. రకుల్ ప్రీత్‌సింగ్ కీలకపాత్రలో నటిస్తుంది. మంగళవారం హను రాఘవపూడి పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ ఓ స్పెషల్ గ్లింప్స్‌ను విడుదల చేశారు.
మేకర్స్ విడుదల చేసిన గ్లింప్స్‌లో ‘ఒక అసాధారణ వ్యక్తి, తన అభిరుచిని త్వరలోనే చూస్తారు’ అంటూ షూటింగ్ సమయంలో మంచు కురిసే ప్రదేశంలో హను హార్డ్ వర్క్‌ను చూపించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇప్పటికే చిత్రంపైన ప్రేక్షకులలో మంచి అంచనాలే నెలకొన్నాయి. ఇక ఇటీవలే శ్రీరామ నవమీ సందర్భంగా విడుదలైన గ్లింప్స్‌కు మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం షూటింగ్ జరుపకుంటున్న ఈ చిత్రం మణిరత్నం ‘రోజా’ తరహాలో ఉండనున్నట్లు గతంనుంచి వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలో దుల్కర్ రామ్ పాత్రలో నటించగా, మృనాల్ సీత పాత్రలో నటించనుంది. రకుల్ అఫ్రీని పాత్రలో కాశ్మీరి ముస్లిం అమ్మాయిగా నటించనుంది. ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.
Birthday wishes to our 'Mad Man' @hanurpudi from team #SitaRamam ❤️🎥
▶️ https://t.co/lfk0exXxEQ@dulQuer @mrunal0801 @iamRashmika @iSumanth @Composer_Vishal #PSVinod @MrSheetalsharma @VyjayanthiFilms @SwapnaCinema @SonyMusicSouth
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) April 19, 2022