Chiranjeevi | టాలీవుడ్లో మోస్ట్ క్రేజీయెస్ట్ కాంబినేషన్లో ఒకటి చిరంజీవి (Chiranjeevi) , వివి వినాయక్. ఈ ఇద్దరి కలయికలో వచ్చిన ఠాగూర్ ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టింది. ఇక పొలిటికల్ ఎంట్రీ తర్వాత రాజకీయాలకు స్వస్తి చెప్పిన చిరంజీవికి ఖైదీ నంబర్ 150తో గ్రాండ్ రీఎంట్రీ అందించాడు వివి వినాయక్. సిల్వర్ స్క్రీన్‌పై మ్యాజిక్ చేసే వివి వినాయక్ (VV Vinayak) , చిరంజీవి ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే ఎలా ఉంటుంది. అభిమానులకు మాత్రం స్పెషల్ అనే చెప్పాలి.
తాజాగా ఈ ఇద్దరు ఒక్క చోట చేరి సందడి చేశారు. మెగాస్టార్ ప్రస్తుతం మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంభరలో నటిస్తు్న్నాడని తెలిసిందే. విశ్వంభర షూటింగ్ దశలో ఉండగా.. హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతున్న సెట్స్‌కు వెళ్లాడు వివి వినాయక్. సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటూ డైరెక్టర్ వశిష్ఠ అండ్ టీం మెంబర్స్‌కు విషెస్ తెలియజేశారు. ఇప్పటికే విశ్వంభర సెట్స్‌ను కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్-షాలిని, పవన్ కల్యాణ్, రాంచరణ్ సందర్శించారని తెలిసిందే.
ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ విక్రమ్ తెరకెక్కిస్తుండగా.. ఆర్ఆర్ఆర్ ఫేం లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే లాంఛ్ చేసిన విశ్వంభర టైటిల్ లుక్, కాన్సెప్ట్ వీడియో మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతూ సినిమాపై క్యూరియాసిటీతోపాటు అంచనాలు పెంచేస్తుంది. ఈ చిత్రాన్ని 2025 జనవరి 10న గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు మేకర్స్.
A special & memorable day on #Vishwambhara sets for me.
With the one and only MEGASTAR @KChiruTweets Garu and my dearest Guru #VVVinayak Garu. Truly blessed to have these two in my life.
In cinemas on January 10th, 2025 🌠@UV_Creations pic.twitter.com/B1VhgiBY5q
— Vassishta (@DirVassishta) June 24, 2024