‘వైవా’ సిరీస్‌తో నటుడిగా గుర్తింపు తెచ్చుకుని.. ఆ తర్వాత నటుడిగా , యాంకర్‌గా అదరగొట్టాడు హర్ష. పలు సినిమాలలో తన కామెడీతో కడుపుబ్బ నవ్వించిన వైవా హర్ష.. బుధవారం రోజు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. నగరంలోని ఓ ప్రముఖ ఫంక్షన్ హాల్లో అక్షరతో హర్షకు వివాహం జరిగింది. ఏడు రోజులపాటు జరిగిన పెళ్లి వేడుకల్లో వధూవరుల కుటుంబసభ్యులు, స్నేహితులతోపాటు పలువురు సినీ ప్రముఖులు సైతం పాల్గొన్నారు.
దర్శకుడు మారుతి, నటుడు ప్రవీణ్, స్వాతి రెడ్డి, మహాతల్లి ఫేమ్ జాహ్నవి పాల్గొని వధూవరులకు అభినందనలు తెలిపారు. మరోవైపు సుహాస్ కథానాయకుడిగా నటించిన ‘కలర్‌ఫొటో’లోనూ హర్ష తనదైన నటనతో మెప్పించారు. ఇటీవల విడుదలైన ‘గల్లీరౌడీ’లోనూ హర్ష నటించారు.
యూట్యూబ్ ద్వారా ఫేమస్ అయిన వైవా హర్ష నెటిజన్లకు బాగా దగ్గరయ్యాడు. సోషల్ మీడియా ద్వారా కూడా సినిమాల్లో ఛాన్సులు అందుకోవచ్చని నిరూపించిన వారిలో వైవా హర్ష ఒకరు. కేవలం యూ ట్యూబ్ వీడియోల ద్వారా దాదాపు సెలబ్రెటీల రేంజ్లో క్రేజ్ కొట్టేసిన హర్ష.. పలు సినిమా అవకాశాలు పట్టేశాడు.