Viswam Movie | తెలుగు కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్, టాలీవుడ్ దర్శకుడు శ్రీనువైట్ల దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం విశ్వం. గోపిచంద్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంలో కావ్య థాపర్ కథానాయికగా నటించింది. ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్‌ను అందుకుంది. శ్రీనువైట్ల అదే పాత ఫార్ములా వాడడంతో ప్రేక్షకులు తిప్పికొట్టారు. అయితే తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. ఎలాంటి ప్రకటన లేకుండా ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఇండియాని నాశనం చేయాలని ఓ తీవ్రవాది కుట్ర పన్నుతాడు. ఈ క్రమంలో ఓ హత్య చేస్తాడు. అయితే ఆ హత్యని ఓ పాప చూస్తుంది. దీంతో పాపని చంపడానికి ప్రయత్నిస్తాడు. అయితే ఆ పాపని రక్షించడానికి గోపి (గోపీచంద్) వస్తాడు. అసలు గోపి ఎవరు? ఈ కథలో సమైరా (కావ్యా థాపర్) పాత్ర ఏమిటి? గోపి చివరికి ఆ పాపని రక్షించాడా లేదా? అనేది మిగిలిన కథ.