Viswak Sen | తమిళ నటుడు సూర్య అంటే తనకు పిచ్చి అని తన సినిమా గజిని చూసి తాను కూడా గుండు కొట్టించుకున్నాను అని తెలిపాడు నటుడు విశ్వక్ సేన్. సూర్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం కంగువ. ఈ సినిమా నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా తెలుగు ప్రీ రిలీజ్ వేడుకను గ్రాండ్‌గా నిర్వహించారు మేకర్స్. ఇక ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా దర్శక దిగ్గజం రాజమౌళితో పాటు సురేష్ ప్రోడక్షన్ అధినేత సురేష్ బాబు, నటులు సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్, తదితరులు హాజరై సందడి చేశారు.
అయితే ఈ సినిమాకు సంబంధించి విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. తన చిన్ననాటి జ్ఞాపకాన్ని పంచుకున్నాడు. చిన్నప్పుడు తిరుపతి తీసుకపోయి గుండు చేసుకో అంటే ఏడుస్తుండే నేను. కానీ గజిని సినిమా చూసిన తర్వాత పని గట్టుకపోయి గుండు కొట్టించుకున్నా. ఆ టైంలో నాకు తెల్వదు.. హీరోలు అట్ల గుండు కూడా చేసుకుంటారా.. గుండులో కూడా స్మార్ట్‌గా ఉంటారు అని సూర్య సార్‌ని చూశాకే తెలిసింది అంటూ విశ్వక్ చెప్పుకోచ్చాడు.
Mass ka Das #Vishwaksen recalls his childhood memories with a reference to the movie #Ghajini 🥳#KanguvaTour #KanguvaFromNov14 🗡️ pic.twitter.com/yjq8vFsw2o
— Shreyas Sriniwaas (@shreyasmedia) November 7, 2024