Vishwambhara Introduction Song | టాలీవుడ్ నుంచి వస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియన్ మూవీ విశ్వంభర. ఈ సినిమా కోసం మెగా అభిమానులతో పాటు మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే గత ఏడాది దసరా కానుకగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేయగా.. మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే తాజాగా ఈ సినిమా నుంచి కీలక అప్డేట్ను వెల్లడించారు మేకర్స్.
విశ్వంభర సినిమాలో మెగాస్టార్ ఇంట్రడక్షన్ సాంగ్ చిత్రీకరణ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. ఈ పాటకు శోభిమాస్టర్ కొరియోగ్రఫీ అందిస్తున్నాడు. ఈ పాట గురించి చెప్పాలి అంటే మెగాస్టార్ తన స్వాగ్తో డాన్స్‌తో అలరించబోతుండగా.. ఎంఎం కీరవాణి అందించబోతున్న సంగీతం సినిమాకే హైలెట్‌గా నిలవబోతుంది. మెగా మాస్ బియాండ్ యూనివర్స్ కోసం సిద్ధంగా ఉండండి అంటూ చిత్రబృందం రాసుకోచ్చింది.
సోషియో ఫాంటసీ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తుండగా.. కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష కథానాయికగా నటిస్తుంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ విక్రమ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సంగీతం అందిస్తున్నారు.
#Vishwambhara shooting underway with MEGASTAR’S introduction song being shot under the choreography of @shobimaster ❤️🔥
This song will be a treat to watch with MEGASTAR in his element, dancing to the sensational tune by @mmkeeravaani 💥💥
Get ready for MEGA MASS BEYOND UNIVERSE… pic.twitter.com/OOhwdoKyxW
— UV Creations (@UV_Creations) February 15, 2025