Vishwambara | మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా సోషియో-ఫాంటసీ చిత్రం విశ్వంభరపై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. సంక్రాంతికి ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న చిరంజీవి, ఇప్పుడు మరో భారీ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ‘బింబిసార’తో సక్సెస్ అందుకున్న దర్శకుడు మల్లిడి వశిష్ఠ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. పురాణాల నేపథ్యంలో 14 లోకాల కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం విజువల్ వండర్‌గా నిలవనుందని చిత్రబృందం చెబుతోంది. లోకాలను కాపాడే రక్షకుడిగా చిరంజీవి వింటేజ్ లుక్‌లో కనిపించనున్నారని సమాచారం.
ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా త్రిష కృష్ణన్ నటిస్తోంది. దాదాపు దశాబ్దం తర్వాత ఈ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుండటం విశేషం. అలాగే ఆషికా రంగనాథ్, కునాల్ కపూర్ వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. జూలై 10న ఈ చిత్రం విడుదలయ్యే అవకాశముందని టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా మ్యూజిక్ డిపార్ట్మెంట్లో ఆసక్తికర మార్పు చోటుచేసుకుంది. ఇప్పటికే ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం, నేపథ్య సంగీతం (BGM) బాధ్యతలను యువ సంగీత దర్శకుడు హరి గౌరకు అప్పగించినట్లు తెలుస్తోంది.
పాటల కంపోజిషన్‌ను కీరవాణి చూసుకుంటుండగా, భారీ యాక్షన్ సన్నివేశాలు, ఫాంటసీ ఎలిమెంట్స్‌కు పవర్ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించే బాధ్యతను హరి గౌర తీసుకున్నారని సమాచారం. ఇప్పటికే ఆయన తన పనిని ప్రారంభించారని సినీ వర్గాలు చెబుతున్నాయి. హరి గౌర గతంలో చేసిన ప్రాజెక్టులు ఆయన ప్రతిభను నిరూపించాయి. ముఖ్యంగా హనుమాన్ చిత్రానికి అందించిన సంగీతం మంచి ప్రశంసలు అందుకుంది. అలాగే ‘మిరాయ్’ వంటి సినిమాలకు ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. మెలోడీస్‌తో పాటు గూస్బమ్స్ తెప్పించే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ నేపథ్యంలో ‘విశ్వంభర’లో హరి గౌర ఎంట్రీ సినిమాకు మరో ప్లస్ పాయింట్‌గా మారనుందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. భారీ విజువల్స్‌తో వస్తున్న ఈ చిత్రానికి ఆయన ఇచ్చే నేపథ్య సంగీతం ఏ స్థాయిలో ఉంటుందో చూడాలని మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.