Gaami | టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. మాస్ కా దాస్ నటిస్తోన్న చిత్రాల్లో ఒకటి గామి (Gaami). చాలా కాలం క్రితమే విడుదల కావాల్సిన ఈ చిత్రం పలు కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. డబ్బింగ్ స్టూడియోలో ఉన్న ఫొటోను షేర్ చేస్తూ.. మరిన్ని సర్ప్రైజెస్ రాబోతున్నాయంటూ సెప్టెంబర్‌లో హింట్ ఇచ్చాడు విశ్వక్ సేన్.
తాజాగా గామి రన్ టైం అప్డేట్ బయటకు వచ్చింది. గామి రన్ టైం 2 గంటల 24 నిమిషాలు. అడ్వెంచరస్ ఫాంటసీ ఫిల్మ్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీలో విశ్వక్ సేన్ అఘోరాగా కనిపించబోతున్నాడు. విద్యాధర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఎంజీ అభినయ, మహ్మద్ సమద్, దయానంద్ రెడ్డి, హారికా ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వీ సెల్యూలాయిడ్ సమర్పణలో కార్తీక్ శబరీష్ నిర్మిస్తున్నారు.
గామి కోసం హీరోయిన్ చాందినీ చౌదరి కూడా డబ్బింగ్ కూడా పూర్తి చేసినట్టు అప్డేట్ వచ్చింది. మేకర్స్ గామి విడుదల తేదీపై క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. విశ్వక్ సేన్ మరోవైపు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి (Gangs of Godavari)లో కూడా నటిస్తున్నాడు. విశ్వక్ సేన్ 11 (VS 11)గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఛల్ మోహన్ రంగ ఫేం కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నాడు. డీజే టిల్లు ఫేం నేహాశెట్టి , అంజలి ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు.
డెబ్యూ డైరెక్టర్ రవితేజ దర్శకత్వంలో విశ్వక్ సేన్ 10 (VS 10)లో కూడా నటిస్తున్నాడు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌తో కలిసి ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్‌పై ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు.
Gaami2
చాందినీ చౌదరి గామి అప్డేట్..
Gaami is finally a wrap! Can’t wait for the world to witness this fantastic film we made 🔥 pic.twitter.com/a9v7E6SytL
— Chandini Chowdary (@iChandiniC) May 1, 2023
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి గ్లింప్స్..
విశ్వక్సేన్, నేహాశెట్టి డ్యాన్స్..