Das Ka Dhamki | ఓవర్సీస్లోనూ ధమ్కీ ఇస్తున్న విశ్వక్సేన్.. దాస్ కా ధమ్కీ తాజా కలెక్షన్లు
కామెడీ యాక్షన్ డ్రామా నేపథ్యంలో విశ్వక్ సేన్ (Vishwak Sen) స్వీయ దర్శకత్వంలో హీరోగా నటించిన చిత్రం దాస్ కా ధమ్కీ (Das Ka Dhamki). మార్చి 22న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. తాజాగా ఈ సినిమా యూఎస్ కలెక్షన్లకు సంబంధించిన అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది.
టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Vishwak Sen) స్వీయ దర్శకత్వంలో హీరోగా నటించిన చిత్రం దాస్ కా ధమ్కీ (Das Ka Dhamki). కామెడీ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 22న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. ఈ మూవీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదలైంది. ధమ్కీ తొలి రోజు నుంచి మంచి టాక్‌తో స్క్రీనింగ్ అవుతోంది. తాజాగా ఈ సినిమా యూఎస్ కలెక్షన్లకు సంబంధించిన అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది.
తాజా టాక్ ప్రకారం ధమ్ కీ ఇప్పటివరకు యూఎస్‌లో 30వేల డాలర్లు (రూ.2,46,91,650) వసూళ్లు చేసింది. రానున్న రోజుల్లో మరింత వసూళ్లు రాబట్టడం ఖాయమని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. మొత్తానికి ఇప్పటివరకు వచ్చిన వసూళ్లు కూడా విశ్వక్ సేన్ కెరీర్లో బెస్ట్‌గా నిలిచినట్టు ట్రేడ్ సర్కిల్ టాక్. డ్రగ్స్, ఫార్మారంగం చుట్టూ తిరిగే కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీలో నివేదా పేతురాజ్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటించింది. పాగల్ తర్వాత విశ్వక్ సేన్, నివేదా కాంబినేషన్లో వచ్చిన రెండో సినిమా ఇది.
ఈ మూవీలో అజయ్, రావు రమేశ్, పృథ్విరాజ్, జబర్దస్త్ ఫేం హైపర్ ఆది, మహేశ్ ఆచంట కీలక పాత్రలు పోషించారు. లియోన్ జేమ్స్ కంపోజ్ చేసిన పాటలను మ్యూజిక్, మూవీ లవర్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని వన్మయి క్రియేషన్స్, విశ్వక్ సేన్ సినిమాస్ బ్యానర్లు సంయుక్తంగా తెరకెక్కించాయి. ఈ మూవీకి ప్రసన్నకుమార్ బెజవాడ కథనందించాడు. ధమ్కీ సీక్వెల్ కూడా ఉండబోతుందని ప్రకటించి.. సినిమాపై ఇప్పటినుంచే క్యూరియాసిటీ పెంచేస్తున్నాడు విశ్వక్సేన్.
Read Also :
Niharika Konidela | నెట్టింట్లోకి నిహారిక కలర్‌ఫుల్ రీఎంట్రీ.. పుకార్లపై క్లారిటీ ఇచ్చినట్టేనా..?
NTR 30 | ఎన్టీఆర్ 30 స్టన్నింగ్ అప్డేట్.. ఫస్ట్ యాక్షన్ సీన్ ఇదే
Ram Charan | కుమారుడిని చిరంజీవి ఎలా విష్ చేశాడో చూడండి..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

