విశ్వజిత్, అర్చన సింగ్, ఊర్వశి రాయ్, రఘుదీప్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘కౌశిక వర్మ దమయంతి’. గీతా కౌశిక్ నిర్మించారు. సుధీర్, విశ్వజిత్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ చిత్రం నుంచి ‘పదరా పదరా వేటకు వెళ్దాం’ అనే పాటను నిర్మాత సి కళ్యాణ్ విడుదల చేశారు.
నటుడు విశ్వజిత్ మాట్లాడుతూ…‘రెండు శతాబ్దాల పూర్వం కథను వర్తమానంతో ముడిపెట్టి ఈ సినిమాను రూపొందించాం. చారిత్రక నేపథ్య సినిమాగా ఆకట్టుకుంటుంది’ అన్నారు.