తొమ్మిదో వారం బాధాతప్త హృదయంతో బయటకు వచ్చిన విశ్వకి నాగార్జున ఓ టాస్క్ ఇచ్చారు. ఇంట్లో పది మంది సభ్యులున్నారు. వారికి ర్యాంక్స్ ఇవ్వమని అన్నాడు. చివరి నుండి వచ్చిన విశ్వ ముందుగా ప్రియాంకకు పదో స్థానం ఇచ్చాడు. తప్పు చేసిన తీసుకోలేవు నువ్వు.అది మార్చుకోమని సలహా ఇచ్చాడు. ఇక కాజల్‌కి తొమ్మిదో స్థానం ఇవ్వగా, ఆటలో నీ మీదే నమ్మకం కోల్పోతున్నావు. స్ట్రాంగ్‌గా ఉండు అని అన్నాడు.
ఇక జెస్సీ మధ్యలో ఆటను వదిలేస్తున్నాడని ఎనిమిదో స్థానంకే పరిమితం చేశాడు. ఇక అనీ మాస్టర్‌కి ఏడో స్థానం ఇచ్చి మీ ఆట మీరు ఆడండి. ఎవరు ఎలా ఆడితే మీకెందుకు,ఎన్నో చూసి ఇక్కడకు వచ్చారు అంటూ సలహా ఇచ్చారు. ఇక ఆరో స్థానంలో మానస్‌ని ఉంచాడు. గెలుపోటములు ఒకేలా తీసుకోలేడని చెప్పాడు విశ్వ. ఇక సిరి వచ్చినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అదే ఎనర్జీతో ఉంది.. ఏమున్నా కూడా మొహం మీదే చెబుతుందంటూ ఐదో స్థానంలో పెట్టేశాడు.
సన్నీకి నాల్గో స్థానం ఇచ్చిన విశ్వ..ఫైర్ మెయింటైన్ చేయి అని అన్నాడు. ఇక మూడో స్థానంలో షణ్ముఖ్‌ని ఉంచి, ఆయనకు ఇంత చిన్న వయస్సులో అంత మెచ్యూరిటీ ఉండడం గొప్ప విషయం. అప్పుడప్పుడు మాటలు జారతావు.అవి చూసుకో అని సలహా ఇచ్చాడు విశ్వ. రవిని అందరూ గుంటనక్క అంటారు. కానీ అది స్ట్రాటజీ అయి ఉండొచ్చు. కానీ అందరి గురించి మంచిగానే ఆలోచిస్తాడు. అవసరం లేకపోయినా కూడా వెళ్లి చెబుతాడు. ఇకపై అలా చేయకు అంటూ రెండో స్థానాన్ని ఇచ్చాడు.
ఇక శ్రీరామ్ చంద్రకు తొలి స్థానం ఇచ్చి చాలా ఎమోషనల్ అయ్యాడు విశ్వ. శ్రీరామ్‌ని చూస్తుంటే మా తమ్ముడిని చూసినట్టే ఉంటుంది. కెప్టెన్సీ సమయంలో స్ట్రిక్‌గా ఉన్నారని ఎవరో అన్నారట. దాని గురించి ఎక్కువగా ఆలోచించకు. నీకు నటించడం రాదు. జాగ్రత్తగా ఆడు అంటూ అతనికి నంబర్ వన్ స్థానాన్ని కట్టబెట్టాడు.