ఎల్ నినో ప్రభావంతో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడం.. తీవ్రమైన కరెంట్ కోతలతో వ్యవసాయం చేయలేక విసిగిపోయిన ఓ రైతు చివరకు తాను సాగు చేసిన వరిని పశువులకు మేతకు వదిలాడు. వనపర్తిలోని 21వ వార్డు పరిధిలో ఉన్న నందిమల్లగడ్డకు చెందిన రైతు బాలస్వామి మూడెకరాల్లో వరి సాగు చేశాడు.
ఉన్న ఒక్క బోరులో నీటిమట్టం గణనీయంగా తగ్గిపోయింది. సరిపడా సాగునీరు అందక పంట వాడుముఖం పట్టింది. దీనికితోడు కరెంట్ సక్రమంగా ఉండకపోవడంతో చేసేది లేక పంటను పశువుల మేతకు వదిలేశాడు. మూడెకరాల కోసం దాదాపు రూ.లక్ష వరకు ఖర్చు చేసినట్టు పోయాడు.