Bigg Boss Telugu 8 – Vishnu Priya | బుల్లితెర ప్రేక్షకుల ఫేవరేట్ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 చివరి అంకానికి చేరుకుంది. ఇప్పటికే 14 వారాలుగా అలరిస్తున్న ఈ షో ముగియడానికి ఇంకా ఒక్క వారమే మిగిలింది. డిసెంబర్ 15న బిగ్ బాస్ తెలుగు 8 గ్రాండ్ ఫినాలే నిర్వహించి టైటిల్ విన్నర్ ఎవరో ప్రకటించనున్నారు నిర్వహాకులు. అయితే ఈ సీజన్ టైటిల్ విన్నర్ ఎవరు అవుతారా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలావుంటే తాజాగా హౌజ్ నుంచి ఎలిమినేట్ అయ్యింది విష్ణుప్రియ.
ఇప్పటికే హౌజ్ నుంచి బేబక్కతో పాటు, శేఖర్ బాషా, అభయ్, సోనియా ఆకుల, గంగవ్వ, హరితేజ, నవీన్, టేస్టీ తేజ, పృథ్వి శెట్టి ఎలిమినేట్ అవ్వగా.. ఈ వారం డబుల్ ఎలిమినేషన్లో భాగంగా.. శనివారం హౌజ్ నుంచి శివంగి రోహిణి ఎలిమినేట్ అయ్యింది. తాజాగా ఆదివారం ఎలిమినేషన్లో భాగంగా.. హౌజ్ నుంచి విష్ణుప్రియ బయటకు వచ్చింది. టైటిల్ ఫేవరెట్ కంటెస్టెంట్‌గా హౌజ్‌లోకి అడుగుపెట్టిన ఈ భామ అతి తక్కువ కాలంలోనే అభిమానుల నుంచి మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఫస్ట్ టూ వీక్స్ మంచిగా ఆడిన విష్ణుప్రియ ఆ తర్వాత పృథ్వీరాజ్‌తో లవ్ ట్రాక్‌కు తెరలేపింది. అయితే పృథ్వీరాజ్ మాత్రం విష్ణుని ఫ్రెండ్షిప్ అంటూ పక్కన పెట్టాడు. అయితే ఈ సీజన్ టైటిల్ కొడుతుందని భావించిన విష్ణుప్రియా ఉహించని విధంగా హౌజ్ నుంచి ఎలిమినేట్ అయ్యింది. ఈ వారం గ్రాండ్ ఫినాలే బరిలో ఆరుగురు కంటెస్టెంట్స్ ఉండగా.. ఇందులో డేంజర్ జోన్లో రోహిణి, విష్ణుప్రియలు ఉన్నారు. ఈ క్రమంలో మొదటి ఎలిమినేషన్‌గా రోహిణి ఎలిమినేట్ అయి బిగ్ బాస్ హౌజ్ నుంచి అవుట్ అయింది. ఇక డేంజర్ జోన్లో ఉన్న రెండో కంటెస్టెంట్ విష్ణుప్రియ అదివారం బయటకు వచ్చింది.
బిగ్ బాస్ సీజన్ 8లో 12వ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన విష్ణుప్రియ దాదాపు 3 నెలలకు పైగా హౌజ్‌లో కొనసాగింది. దీంతో ఆమెకు వారానికి రూ.4లక్షల చొప్పున 14 వారాలకు రూ. 56 లక్షలు అందుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సీజన్ టైటిల్ విన్నర్ అనేది ఎవరు అని చూసుకుంటే.. నిఖిల్, గౌతమ్ మధ్య పోటి ఉండబోతున్నట్లు తెలుస్తుంది.