విష్ణు విశాల్ కథానాయకుడిగా నటిస్తున్న ఇన్వెస్టిగేటివ్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఆర్యన్’. ప్రవీణ్ కె దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెల 31న శ్రేష్ట్మూవీస్ ద్వారా ఉభయ తెలుగు రాష్ర్టాల్లో ఈ చిత్రం విడుదలకానుంది. మంగళవారం ఈ సినిమా నుంచి ‘ఐయామ్ ది గాయ్’ అనే పాటను విడుదల చేశారు. జిబ్రాన్ స్వరపరిచిన ఈ పాటకు సామ్రాట్ సాహిత్యం అందించారు.
శ్రీకాంత్, హరిహరన్ ఆలపించారు. ఆద్యంతం ఉత్కంఠను పంచే పరిశోధనాత్మక చిత్రమిదని, ఐదు రోజుల్లో జరిగే వరుస హత్యల తాలూకు కేసులను ఓ పోలీస్ అధికారి ఎలా ఛేదించాడన్నది ఆసక్తికరంగా సాగుతుందని మేకర్స్ తెలిపారు. సెల్వరాఘవన్, శ్రద్ధా శ్రీనాథ్, మానసచౌదరి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జిబ్రాన్, నిర్మాతలు: శుభ్ర, ఆర్యన్ రమేష్, విష్ణు విశాల్, దర్శకత్వం: ప్రవీణ్ కె.