ప్రతి సంవత్సరం దసరా తర్వాత జలవిహార్‌లో అలయ్ బలయ్ కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ రోజు జరిగిన కార్యక్రమంలో ఒకే వేదికపై అన్ని పార్టీల నేతలు ప్రముఖులు కలుసుకున్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరు కాగా, ఆయనతో పాటు తెలంగాణ గవవర్నర్ తమిళ సై, ఏపీ గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్, హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ , జనసేనాని పవన్ కళ్యాణ్, మా అధ్యక్షుడు మంచు విష్ణు హాజరయ్యారు.
తాజాగా మంచు విష్ణు.. తన సోషల్ మీడియాలో పెట్టిన ట్వీట్ ఒకటి వైరల్ అవుతుంది.అలయ్ బలయ్ కార్యక్రమం వీడియో షేర్ చేయగా, ఇందులో చివర పవన్ కళ్యాణ్ కనిపిస్తున్నాడు. అయితే మంచు విష్ణు వీడియో చివరలో ఉంది ఎవరో గెస్ చేయండని ట్వీట్ చేశాడు.ఈ వీడియో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.
అలయ్ బలయ్ కార్యక్రమం అద్భుతంగా ఉందని జనసేన పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కళ్యాణ్ అన్నారు. ఇది ఎంతో స్ఫూర్తిదాయకమని, ఇలాంటి కార్యక్రమాలు ఉండాలని చెప్పారు.ఈ కార్యక్రమానికి సినీనటుడు కోట శ్రీనివాసరావు, ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు తదితరులు సైతం హాజరయ్యారు.
Can you guess whose at the end of the video? 💪🏽 pic.twitter.com/FJyMiWRA2T
— Vishnu Manchu (@iVishnuManchu) October 17, 2021