Vishnu Priya | యాంకర్ విష్ణుప్రియ భీమినేని చుట్టూ సోషల్ మీడియాలో కొత్త వివాదం చెలరేగింది. ఆమె ఇన్స్టాగ్రామ్ ఖాతాలో అసభ్యకర కంటెంట్‌ను ప్రోత్సహిస్తున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తడంతో, ఏఐఎస్ఎఫ్ నాయకులు పోలీసులను ఆశ్రయించారు. శనివారం విజయవాడలోని సూర్యారావుపేట సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఏఐఎస్ఎఫ్ నేతలు అధికారిక ఫిర్యాదు సమర్పించారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం. సాయికుమార్ నేతృత్వంలో ఈ ఫిర్యాదు ఇచ్చినట్లు సమాచారం.తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా అర్ధనగ్న వీడియోలు వీక్షించాలంటే సభ్యత్వ రుసుము చెల్లించాలని విష్ణుప్రియ ప్రచారం చేస్తున్నారని ఏఐఎస్ఎఫ్ నేతలు ఆరోపించారు. టెలివిజన్ షోల ద్వారా మంచి గుర్తింపు పొందిన ఒక ప్రజాప్రతినిధి స్థాయి సెలబ్రిటీ, ఇలాంటి కంటెంట్‌ను ప్రోత్సహించడం యువతపై ప్రతికూల ప్రభావం చూపుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
సమాజంలో ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తులు డబ్బు కోసం ఇలాంటి చర్యలకు పాల్పడటం సిగ్గుచేటని ఏఐఎస్ఎఫ్ నాయకులు తీవ్రంగా విమర్శించారు. ఈ తరహా కంటెంట్ వల్ల సమాజంలో నైతిక విలువలు దెబ్బతింటాయని వారు పేర్కొన్నారు. సైబర్ క్రైమ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఏఐఎస్ఎఫ్ నేతలు రెండు ప్రధాన డిమాండ్లు చేశారు. విష్ణుప్రియ ఇన్స్టాగ్రామ్ ఖాతాను తక్షణమే నిలిపివేయాలి, అలానే
ఐటీ చట్టం మరియు సంబంధిత సెక్షన్ల కింద క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలి
ఫిర్యాదు చేసిన సమయంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు దీపక్, సిద్దు, మనోజ్ సహా పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. సమాజంలో ఇలాంటి ధోరణులను సహించబోమని, అవసరమైతే న్యాయపరమైన పోరాటం కొనసాగిస్తామని వారు హెచ్చరించారు. సోషల్ మీడియా కంటెంట్‌పై బాధ్యత, నైతికత అంశాలు మరోసారి చర్చకు వచ్చాయి. ఈ వ్యవహారంపై పోలీసులు ఎలా స్పందిస్తారు? విష్ణుప్రియ నుంచి ఎలాంటి క్లారిటీ వస్తుంది? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కాగా, విష్ణు ప్రియ పోవే పోరా షోతో తెలుగు ప్రేక్షకులని పలకరించి మంచి గుర్తింపు సంపాదించింది. అలానే బిగ్ బాస్ షోలోను పాల్గొని సందడి చేసింది.