Vishnu Priya | బుల్లితెరపై యాంకర్‌గా, నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న విష్ణుప్రియ భీమినేని మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. షార్ట్ ఫిలిమ్స్‌తో కెరీర్‌ను ప్రారంభించిన ఆమె, పలు టెలివిజన్ షోల ద్వారా ప్రేక్షకులకు దగ్గరైంది. అనంతరం కొన్ని సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న విష్ణుప్రియ, ‘బిగ్‌బాస్ తెలుగు 8’లో పాల్గొనడం ద్వారా మరింత పాపులారిటీ సంపాదించింది. అయితే కెరీర్ కంటే ఎక్కువగా సోషల్ మీడియాలో చేసే పోస్టులు, వ్యక్తిగత వ్యాఖ్యల కారణంగా ఆమె తరచూ వివాదాల్లో నిలుస్తోంది. గత కొంతకాలంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె నిర్వహిస్తున్న పెయిడ్ సబ్స్క్రిప్షన్ కంటెంట్‌పై తీవ్ర చర్చ నడిచింది.
సబ్స్క్రైబర్ల కోసం ప్రత్యేక కంటెంట్ అందిస్తున్న విషయంలో విమర్శలు వెల్లువెత్తగా, కొన్ని విద్యార్థి సంఘాలు మరియు నెటిజన్లు సైబర్ క్రైమ్ పోలీసులను కూడా ఆశ్రయించారు. మరోవైపు తనపై అసత్య ప్రచారం జరుగుతోందని ఆరోపిస్తూ, కొన్ని సోషల్ మీడియా అకౌంట్లు మరియు యూట్యూబ్ ఛానళ్లపై విష్ణుప్రియ ఫిర్యాదులు చేసిన సంగతి తెలిసిందే. తన ప్రతిష్ఠకు భంగం కలిగించేలా కంటెంట్ ప్రచారం చేస్తున్నారని ఆమె పేర్కొంది.ఇలాంటి వివాదాలు కొనసాగుతుండగానే తాజాగా ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రూ.399 చెల్లించి సబ్‌స్క్రైబ్ చేసుకున్న తన ఫాలోవర్లతో విష్ణుప్రియ ప్రత్యేక లైవ్ సెషన్ నిర్వహించింది. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు ఆమె సమాధానాలు ఇచ్చింది. ఆ సమయంలో ఓ నెటిజన్ అడిగిన వ్యక్తిగత ప్రశ్నకు స్పందించిన విష్ణుప్రియ, తన “బాడీ కౌంట్” 5 అని వెల్లడించినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఆమె వ్యక్తిగత జీవితంపై చేసిన ఈ వ్యాఖ్యలు ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారాయి.
సాధారణంగా సినీ, టెలివిజన్ రంగాలకు చెందిన ప్రముఖులు తమ వ్యక్తిగత విషయాలను బహిరంగంగా వెల్లడించేందుకు పెద్దగా ఆసక్తి చూపరు. అయితే విష్ణుప్రియ మాత్రం ఎలాంటి సంకోచం లేకుండా ఈ అంశంపై మాట్లాడటంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయింది. ఈ అంశంపై సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతోంది.ఇదే సమయంలో తన వ్యాఖ్యలపై వస్తున్న విమర్శలకు విష్ణుప్రియ కూడా స్పందించింది. ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆమె చేసిన పోస్టులో, “నిజాయితీగా ఉన్నందుకు నేను ఎప్పుడూ బాధపడను” అని పేర్కొంది. ఇతరులు తన గురించి ఎలా ఆలోచించినా, తాను అబద్ధాలు చెప్పే వ్యక్తిని కాదని స్పష్టం చేసింది. తన జీవితానికి సంబంధించిన విషయాల్లో తనకు నచ్చిన విధంగా నిర్ణయాలు తీసుకునే హక్కు ఉందని కూడా ఆమె పరోక్షంగా తెలిపింది.