Vishal Laththi Release Date | కోలీవుడ్ స్టార్ విశాల్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ‘పందెంకోడి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయిన విశాల్ ‘పొగరు’, ‘భరణి’, ‘వాడు-వీడు’ సినిమాలతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. గత కొంత కాలంగా వరుస ఫ్లాప్‌లలో ఉన్న విశాల్ ‘డిటెక్టీవ్’, ‘అభిమన్యుడు’ వంటి వరుస హిట్లతో తిరిగి ట్రాక్‌లోకి వచ్చాడు. ప్రస్తుతం ఈయన నాలుగు సినిమాలు సెట్స్‌పైన ఉన్నాయి. అందులో ‘లాఠీ’ ఒకటి. ఎ.వినోద్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. తాజాగా చిత్ర బృందం టైటిల్ పోస్టర్‌ను రివీల్ చేస్తూ విడుదల తేదీను ప్రకటించారు.
యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విశాల్ పోలీస్ అధికారిగా నటించనున్నాడు. తాజాగా విడులైన పోస్టర్లో విశాల్ మోహం నిండా రక్తపు దెబ్బలతో నోట్లో తాడును పెట్టుకుని ఉన్నాడు. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విశాల్ పోలీస్ అధికారిగా కనిపించనున్నాడు. రానా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రమణ, నంద సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తమిళంతో పాటు, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో ఆగస్టు 12న విడుదల కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
#LaattiFromAug12 pic.twitter.com/RfjWi5fzu1
— Vishal (@VishalKOfficial) May 22, 2022