తమిళ హీరో విశాల్ ప్రయోగాత్మక చిత్రాలతో ప్రేక్షకులని అలరించేందుకు ఎంతగానో ప్రయత్నిస్తుంటారు.చివరిగా చక్ర అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా, ఈ సినిమా అంతగా అలరించలేకపోయింది. ఇక విశాల్ ఇప్పుడు ఆర్యతో కలిసి మల్టిస్టారర్ చేస్తున్నారు. ఎనిమీ అంటూ ఈ మూవీ షూటింగ్ హైద్రాబాద్‌లోనే ప్రారంభమైన సంగతి తెలిసిందే. రామోజీ ఫిలిం సిటీలో మూవీని చిత్రీకరిస్తుండగా, ప్రస్తుతం భారీ యాక్షన్ సీక్వెన్స్ చేస్తున్నారు.
ఓ భారీ యాక్షెన్ సీక్వెన్స్‌లో భాగంగా పెద్ద ప్రమాదం నుండి బయటపడ్డానని విశాల్ పేర్కొన్నారు. అదృష్టవశాత్తు ప్రమాదం నుండి తప్పించుకున్నాను. స్టంట్ ఆర్టిస్టుల తప్పేమి లేదు. జస్ట్ టైమింగ్ మిస్. యాక్షన్ సీక్వెన్స్‌లో ఇలాంటివి జరగడం కామన్. దేవుడి దయ, మీ ప్రేమతో బ్యాక్ టు బ్యాక్ షూటింగ్ చేశాం.. యాక్షన్ సీక్వెన్స్‌ను ఇంత అద్బుతంగా తెరకెక్కించినందుకు థ్యాంక్స్ టు రవివర్మ మాస్టర్ అని విశాల్ చెప్పుకొచ్చారు.
A close call,lucky escape,no fault of de stunt artist,just mistiming,mishaps do happen in action sequences,
— Vishal (@VishalKOfficial) June 18, 2021
God willing&with all blessings,back 2 shoot&successfully done fight sequence&continuing shoot @ Hyd
tks 2 RaviVarma Master 4 lovely fight sequence,will be a treat 2 watch pic.twitter.com/3wE61jjZ1U