Virupaksha Movie | విరూపాక్ష ట్రైలర్ వచ్చేస్తుంది.. ఆసక్తి రేకెత్తిస్తున్న స్పెషల్ పోస్టర్
Virupaksha Movie Trailer | మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ డిఫరెంట్ జానర్లో సినిమాలు చేస్తున్న రావాల్సినంత గుర్తింపు మాత్రం రావడం లేదు. ఆయన సినిమాలను జనాలు ఆదరిస్తున్నా.. కమర్షియల్‌గా భారీ విజయాలు సాధించలేకపోతున్నాయి.
Virupaksha Movie Trailer | మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ డిఫరెంట్ జానర్లో సినిమాలు చేస్తున్న రావాల్సినంత గుర్తింపు మాత్రం రావడం లేదు. ఆయన సినిమాలను జనాలు ఆదరిస్తున్నా.. కమర్షియల్‌గా భారీ విజయాలు సాధించలేకపోతున్నాయి. ప్రస్తుతం సాయిధరమ్ రెండు సినిమాలను సెట్స్ మీద ఉంచాడు. అందులో ‘విరూపాక్ష’ ఒకటి. కార్తిక్ దండు దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్‌లో భారీ అంచనాలే నెలకొన్నాయి. దానికి తగ్గట్లే ఇటీవలే రిలీజైన టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. మిస్టరీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ 21న విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్రబృందం వరుస అప్డేట్లు ప్రకటిస్తూ సినిమాపై ఆసక్తి క్రియేట్ చేస్తున్నారు.
తాజాగా మేకర్స్ ఈ సినిమా ట్రైలర్‌కు సంబంధించిన అప్డేట్ను ప్రకటించారు. త్వరలోనే ట్రైలర్ రిలీజ్ కాబోతుందంటూ ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. పోస్టర్లో సాయిధరమ్ తేజ్ వెనుక పక్షి రెక్కలతో ఉన్న విజువల్ ఆసక్తి పెంచుతుంది. చేతిలో అగ్గి కట్టెను పట్టుకుని సంయుక్తను దుష్ట శక్తుల నుంచి కాపాడుతున్నట్లు పోస్టర్లో కనిపిస్తుంది. మొదటి నుంచి ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఎక్కడలేని క్యూరియాసిటీ ఉంది. పైగా చిత్రబృందం రిలీజ్ చేసిన పోస్టర్లు, టీజర్ జనాలను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
ఒక ఊరిని వరుస చావులు వెంబటిస్తుంటాయి. ఆ చావులకు గల కారణాలు ఏంటీ అని తెలుసుకోవాడానికి హీరో ఆ ఊరికి వెళ్తాడు. అయితే అక్కడ ఆ హీరోకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అసలు ఆ చావుల వెనుక ఉన్న మిస్టరీ ఎంటీ అనే ప్రశ్నల చుట్టు కథ తిరుగుందని సమాచారం. బ్లాక్ మేజిక్ వంటి అంశాలను ఈ సినిమాలో టచ్ చేశారని తెలుస్తుంది. ఈ సినిమాకు సుకుమార్ కథ, స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు సహా నిర్మాతగాను వ్యవహరిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వరా సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. సాయి ధరమ్‌కు జోడీగా సంయుక్త హెగ్డే నటిస్తుంది.
Team #Virupaksha is excited to bring you the next big content with the Month of Virupaksha, #VirupakshaTrailer
Coming soon 💥🥳Stay excited.@IamSaiDharamTej @iamsamyuktha_ @karthikdandu86 @AJANEESHB @Shamdatdop @NavinNooli@SVCCofficial @SukumarWritings#VirupakshaOnApril21 pic.twitter.com/Rz5koNfyLv
— SVCC (@SVCCofficial) April 5, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

