Virupaksha Movie Teaser | సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ మరోసారి ఔన్నత్యాన్ని చాటుకున్నాడు. తన అభిమాని మరణించాడని తెలిసి ఏకంగా టీజర్ లాంచ్‌ను వాయిదా వేశాడు. బుధవారం తన కొత్త సినిమా ‘విరూపాక్ష’ టీజర్‌ను రిలీజ్ చేయాలని ఎప్పుడో ప్లాన్ చేసుకున్నాడు. అంతేకాకుండా మంగళవారం పవన్‌కు స్పెషల్‌గా టీజర్‌ను చూపించి మేనమామా నుంచి అభినందనలు అందుకున్నాడు. కాగా బుధవారం అనూహ్యంగా తన అభిమాని మరణించడంతో టీజర్ రిలీజ్‌ను వాయిదా వేశాడు.
మెగా అభిమాని, సాయిధరమ్ తేజ్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ అయిన రావురి పండు గుండెపోటుతో మరణించాడు. క్రికెట్ ఆడుతుండగా హర్ట్ స్ట్రోక్ వచ్చినట్లు తెలుస్తుంది. కాగా పండు వయసు 28ఏళ్ళు మాత్రమే. సాయిధరమ్ తేజ్ కోసం పండు ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేశాడు. అలాంటి అభిమానిని కోల్పోయినందుకు సాయిధరమ్ తేజ్ తీవ్ర విచారం చేశాడు. పండు మరణ వార్త తెలిసి తేజ్ ఎంతో బాధకు గురైనట్లు తెలిపాడు. పండు కుటుంబాని ప్రగాఢ సానుభూతి తెలియజేశాడు.
ఇలా తన అభిమాని మరణించిన రోజున టీజర్‌ను రిలీజ్ చేయడం భావ్యం కాదని విడుదలను పోస్ట్‌పోన్ చేశాడు. కార్తిక్ దండు దర్శకత్వం వహించిన ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే సుకుమార్ అందించాడు. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు సినిమాపై ఎక్కడలేని బజ్ క్రియేట్ చేశాయి. ఈ సినిమాలో సాయిధరమ్‌తేజ్‌కు జోడీగా సంయుక్త మీనన్ నటిస్తుంది. మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 21న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది.
We are shocked to hear about the untimely demise of Ravuri Pandu Garu ( Mega Fan and Sai Dharam Tej Fans president, Bhimavaram )
As a mark of respect, The teaser release of #Virupaksha stands postponed.
— SVCC (@SVCCofficial) March 1, 2023
Shocked to know about the sad demise of #RavuriPandu Mega fan and bheemavaram SDT fans president. 28 years ki cricket adutoo heart stroke. 😭😭😭 RIP pic.twitter.com/KtPfnFObxu
— Sateesh Botta (@bkrsatish) March 1, 2023