Virupaksha Movie Collections | ప్రస్తుతం టాలీవుడ్ ప్రేక్షకులు విరూపాక్ష మంత్రం జపిస్తున్నారు. సినిమా వచ్చి వారం అవుతున్నా ఇంకా థియేటర్లు నిండుగా కనిపిస్తున్నాయి. బాక్సాఫీస్ దగ్గర కోట్లు కొల్లగొడుతుంది. టిక్కెట్లు భారీ సంఖ్యలో తెగుతున్నాయి. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ థియేటర్లకు పరుగులు తీస్తున్నారు. చాలా కాలం తర్వాత ఒక మంచి థ్రిల్లర్ సినిమా చూశామంటూ సమీక్షలు తెలుపుతున్నారు. ఇక తొమ్మిదేళ్లకు పైగా ఇండస్ట్రీలో ఉంటున్న రాని గుర్తింపు.. సాయితేజ్‌కు ఈ ఒక్క సినిమా తెచ్చిపెట్టింది. ఇప్పటికే రూ.60 కోట్ల కలెక్షన్లు సాధించిన ఈ సినిమా ఫైనల్ రన్లో మరో పది, పదిహేను కోట్లు వెనకేసుకోవడం ఖాయం అనిపిస్తుంది.
ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా మరో ఘనత సాధించింది. తాజాగా ఈ సినిమా ఓవర్సీస్లో మిలియన్ డాలర్ మార్క్‌ను దాటేసింది. ఇక సాయిధరమ్ తేజ్‌కు ఇది తొలి మిలియన్ డాలర్ మూవీ కావడం విశేషం. ఇక ఇదే జోరు కొనసాగితే విరూపాక్ష రెండు మిలియన్ల మార్క్‌కు చేరుకోవడం పెద్ద కష్టమేమి కాదు. అయితే మరి కొన్ని గంటల్లో రిలీజ్ కాబోతున్న ఏజెంట్ ఈ సినిమా స్పీడ్‌కు బ్రేక్‌లు వేసే చాన్స్ ఉంది. ఇప్పటి వరకైతే ఏజెంట్ సినిమాపై చెప్పుకోదగ్గ హైప్ లేదు. కానీ మౌత్ టాక్ పాజిటీవ్‌గా ఉంటే మాత్రం విరూపాక్షకు బ్రేక్ పడ్డట్లే.
మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు కార్తిక్ దండూ దర్శకత్వం వహించాడు. తొలి సినిమాకే కార్తిక్ ఈ రేంజ్ అవుట్ పుట్ ఇచ్చాడంటే మాములు విషయం కాదు. సంయుక్త మీనన్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు సుకుమార్ స్క్రీన్‌ప్లేతో పాటు సహా నిర్మాతగా కూడా పనిచేశాడు.
Spine Chilling Blockbuster #Virupaksha earns another Golden Milestone for Supreme Hero @IamSaiDharamTej 🥳💥
Breaches $1 Million mark at the Overseas Box-office 💰#BlockbusterVirupaksha
IN CINEMAS NOW 👇https://t.co/HzG8SAAGh7@iamsamyuktha_@karthikdandu86 @SVCCofficial pic.twitter.com/5xcU5FXZ8a— SVCC (@SVCCofficial) April 27, 2023