Virosh | విరోష్ జోడీకి గ్లోబల్ క్రేజ్.. ఎయిర్‌బీఎన్‌బీ యాడ్‌తో మరో భారీ రికార్డు!
Virosh | టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జోడీ మరోసారి సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టించింది. అభిమానులు ప్రేమగా “విరోష్” అని పిలుచుకునే ఈ జంట తాజాగా కలిసి చేసిన ఎయిర్‌బీఎన్‌బీ కపుల్ యాడ్ ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో రికార్డు స్థాయిలో స్పందన అందుకుంటోంది.
Virosh | టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జోడీ మరోసారి సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టించింది. అభిమానులు ప్రేమగా “విరోష్” అని పిలుచుకునే ఈ జంట తాజాగా కలిసి చేసిన ఎయిర్‌బీఎన్‌బీ కపుల్ యాడ్ ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో రికార్డు స్థాయిలో స్పందన అందుకుంటోంది. ఈ యాడ్ పోస్టుకు ఇప్పటికే 9.1 మిలియన్లకు పైగా లైక్స్ రావడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక లైక్స్ సాధించిన యాడ్ పోస్టుల్లో ఇది రెండో స్థానంలో నిలిచినట్లు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఆసక్తికర విషయం ఏమిటంటే.. మొదటి స్థానంలో కూడా విజయ్-రష్మిక జంటే ఉండటం అభిమానులను మరింత ఆనందం కలిగిస్తుంది.
గతంలో ఈ జంట కలిసి చేసిన మాన్యవార్ వెడ్డింగ్ క్యాంపెయిన్ యాడ్ సోషల్ మీడియాలో భారీ రికార్డులు సృష్టించింది. ఆ యాడ్ పోస్టుకు 11.5 మిలియన్లకు పైగా లైక్స్ రావడంతో పాటు 100 మిలియన్లకు పైగా వ్యూస్ దక్కాయి. అప్పట్లో అది సోషల్ మీడియాలో పెద్ద సంచలనంగా మారింది. ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజాలు లియోనల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో కలిసి చేసిన లూయిస్ విట్టన్ యాడ్ పోస్టులతో పోలిస్తే.. విజయ్-రష్మిక యాడ్స్‌కు ఎక్కువ రెస్పాన్స్ రావడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ స్థాయి స్పందన రావడానికి ప్రధాన కారణం వీరిద్దరికీ ఉన్న భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ అని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
గత కొన్నేళ్లుగా విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న రిలేషన్షిప్ గురించి సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే వ్యక్తిగత విషయాలపై పెద్దగా స్పందించకుండా, తమ కెమిస్ట్రీతోనే అభిమానులను ఆకట్టుకుంటున్నారు. కలిసి కనిపించిన ప్రతిసారీ ఈ జంట సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది. సినిమాల విషయానికి వస్తే.. విజయ్ దేవరకొండ ప్రస్తుతం దర్శకుడు రవి కిరణ్ కోలా తెరకెక్కిస్తున్న ‘రౌడీ జనార్దన్’ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ రూపొందిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’లో రష్మిక మందన్నతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక రష్మిక మందన్న కూడా వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. బాలీవుడ్లో షాహిద్ కపూర్‌తో కలిసి ‘కాక్టెయిల్ 2’లో నటిస్తుండగా, తెలుగులో ‘మైసా’ చిత్రంలో కనిపించనున్నారు. పాన్ ఇండియా స్థాయిలో వరుస అవకాశాలు అందుకుంటూ ఆమె కెరీర్ దూసుకెళ్తోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Journalist Richa: కిందపడేలా రాహుల్ గాంధీ తోశాడు.. ప్రెగ్నెంట్ జర్నలిస్టు ఆరోపణ
Imran Khan | ముంబై నిరసనలో పాల్గొన్న ఆమిర్ ఖాన్ మేనల్లుడు.. దేశం నుంచి బహిష్కరించాలన్న బీజేపీ నేత
Delhi Police | కేంద్ర బలగాలను ఈ నెల 20 వరకు ఉపసంహరించొద్దు.. హోంశాఖకు ఢిల్లీ పోలీసుల లేఖ
Sobhita Dhulipala | పెళ్లి తర్వాత శోభిత ధూళిపాళ బోల్డ్ ఫోటోషూట్.. షాక్‌లో అక్కినేని అభిమానులు
BRS Protest | రైతులకు 24 గంటల కరెంటు ఇవ్వాలి.. చెల్పూరులో జాతీయ రహదారిపై బీఆర్ఎస్ ధర్నా
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

