Virgin Boys | మిత్రశర్మ, గీతానంద్, శ్రీహాన్, జన్నీఫర్ ఇమ్మాన్యుల్, రోనిత్, అన్షుల ముఖ్య పాత్రలు పోషించిన చిత్రం ‘వర్జిన్ బాయ్స్’. దయానంద్ గడ్డం దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి రాజా దారపునేని నిర్మాత. ఈ జులై 11న సినిమా విడుదల అయింది.ఈ మూవీపై ఆసక్తి కలిగించేందుకు జోరుగా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించారు. హైదరాబాద్‌లో ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ని ఘనంగా నిర్వహించారు. అలాగే ఈ సినిమా టికెట్ కొన్న 11మందికి ఐఫోన్లు గిఫ్ట్‌గా ఇస్తామని ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో చిత్రబృందం ప్రకటించింది.
ఈ కథకు కచ్చితంగా సరిపోయే టైటిల్ ‘వర్జిన్ బాయ్స్’ అని, ఈ సినిమాలో ఎన్నో సర్ప్రైజులు ఉన్నాయని నిర్మాత రాజా దారపునేని తెలిపారు. తమ కాలేజ్ లైఫ్‌లో ఎదురైన కొన్ని సంఘటల ఆధారంగా ఈ కథ తయారు చేశామని, ఇలాంటి సినిమాలు అరుదుగా వస్తాయని దర్శకుడు తెలిపారు. దాంతో భారీ ఎక్స్పెక్టేషన్స్ పెంచుకున్నారు నెటిజన్స్. ఇక ఈ మూవీ ఓటీటీలో ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా, ఈ మూవీని ఆగస్ట్ 15 నుండి స్ట్రీమింగ్ చేయనున్నట్టు ప్రకటించారు. మూవీ స్ట్రీమింగ్ హక్కులని ఆహా సొంతం చేసుకోగా, 15వ తేదీ నుండి ఆన్లైన్లో స్ట్రీమ్ కానుంది.
చిత్రంలో స్తే డుండీ అనే ఇన్నోసెంట్ పాత్రలో శ్రీహాన్ మెప్పించాడు. నిజానికి సినిమాలో కాస్తో కూస్తో కామెడీ పండిందంటే శ్రీహాన్ వల్లే అని చెప్పాలి. ముఖ్యంగా శ్రీహాన్ ‘స్కేల్’ చేష్టలు థియేటర్లో నవ్వులు పూయించాయి అని చెప్పాలి. ఇక మిగిలిన ఇద్దరు హీరోలు రోనిత్, గీతానంద్ కూడా మెప్పించారు. ఎమోషనల్ సీన్లలో గీతానంద్ నటన బాగుంది. హీరోయిన్ల విషయానికొస్తే జెనీఫర్, అన్షుల చూసుకున్నోళ్లకి చూసుకున్నంత అన్నట్లుగా అందాలు ఆరబోశారు. మిత్రా శర్మకి నటనకి స్కోప్ ఉన్న మంచి పాత్ర వచ్చింది. మిత్రా కూడా తనకి వచ్చినంతవరకూ బాగానే యాక్ట్ చేసింది. కానీ కొన్ని ఎమోషనల్ సీన్లలో మిత్రా యాక్టింగ్ అంతగా కనెక్ట్ కాలేదు. మిగిలిన నటీనటులు తమ పాత్రల వరకూ బాగానే మేనేజ్ చేశారు.