గీతానంద్, మిత్రాశర్మ జంటగా నటించిన చిత్రం ‘వర్జిన్ బాయ్స్’. దయానంద్ దర్శకుడు. రాజ్‌గురు ఫిల్మ్స్ పతాకంపై రాజా దరపునేని నిర్మించారు. ఇటీవల ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ‘నేటి జనరేషన్ రిలేషన్ షిప్స్‌ను ప్రజెంట్ చేసే చిత్రమిది. చక్కటి వినోదం, రొమాన్స్, ఎమోషన్స్‌తో ఆకట్టుకుంటుంది. యువతను మెప్పించే అన్ని అంశాలుంటాయి.
పర్ఫెక్ట్ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది’ అని మేకర్స్ తెలిపారు. ఆద్యంతం వినోదాత్మకంగా సాగే చిత్రమిదని, యూత్‌కు రిలేట్ అయ్యే అన్ని ఎలిమెంట్స్ ఉంటాయని నిర్మాత పేర్కొన్నారు. శ్రీహన్, రోనీత్, జెన్నీఫర్, అన్షుల తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: స్మరణ్‌సాయి, దర్శకత్వం: దయానంద్.