మిత్రశర్మ, గీతానంద్, శ్రీహాన్, జన్నీఫర్ ఇమ్మాన్యుల్, రోనిత్, అన్షుల ముఖ్య పాత్రలు పోషించిన చిత్రం ‘వర్జిన్ బాయ్స్’. దయానంద్ గడ్డం దర్శకుడు. రాజా దారపునేని నిర్మాత. ఈ నెల 11న సినిమా విడుదలైంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్లో సక్సెస్ మీట్ నిర్వహించారు.
సినిమాను విజయవంతం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలని, ముఖ్యంగా యువతను సినిమా బాగా ఆకట్టుకుంటున్నదని, ఎంత నెగెటివ్ ప్రచారం చేసినా ఆడియన్స్ మాత్రం సినిమాను ఆదరిస్తున్నారని దర్శకనిర్మాతలు తెలిపారు. ఇంకా నటులు గీతానంద్, శ్రీహాన్ కూడా మాట్లాడారు. ఈచిత్రానికి కెమెరా: వెంకటప్రసాద్, సంగీతం: స్మరణ్సాయి, నిర్మాణం: రాజ్గురు ఫిల్మ్స్.