Virendra Sehwag | సినిమా రిలీజై వారం దాటిన ఇంకా ఆదిపురుష్‌పై విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఇంతలా విమర్శలు ఎదుర్కొన్న సినిమా మరోటి లేదంటే అతిశయోక్తి కాదు. దీనికి పుండుమీద కారం చల్లినట్లు రైటర్ ముంతాషిర్ శుక్లా నిత్యం ఏదో ఒక వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ నెటిజన్లతో బండ బూతులు తిట్టుంచుకుంటున్నాడు. సినిమా కథ, క్యారెక్టర్లు వాస్తవ రామాయణానికి భిన్నంగా ఉన్నాయని చిత్రబృందం తీవ్రంగా మండిపడుతున్నారు. దీనికి నటులు సైతం మినహాయింపు కాదు. ఇప్పటికు పలువురు బాలీవుడ్ నటులు ఈ సినిమాపై తీవ్రంగా విమర్శలు చేశారు.
తాజాగా ఈ లిస్ట్‌లోకి మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ చేరాడు. తాజాగా వీరూ ఈ సినిమా చూసి ట్విట్టర్లో సెటైరికల్ పోస్ట్ వేశాడు. ‘ఆదిపురుష్ చూశాకా.. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో అర్ధమయింది’ అని ట్వీట్ చేశాడు. దాంతో పలువురు నెటిజన్లు ప్రభాస్ ఆదిపురుష్ ఒప్పుకున్నందుకే కట్టప్ప చంపేశాడనే మీనింగ్ వచ్చేలా సెహ్వాగ్ సెటైర్లు వేస్తున్నాడని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఓంరౌత్ తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రభాస్ రాఘవుడి పాత్ర పోషించగా.. కృతిసనన్ జానకిగా కనిపించింది. లంకేష్ పాత్రలో సైఫ్ అలీఖాన్ నటించాడు.
Adipurush dekhkar pata chala Katappa ne Bahubali ko kyun maara tha 😀
— Virender Sehwag (@virendersehwag) June 25, 2023