Virata Parvam New Release Date | పాత్ర నచ్చితే క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా చేయడానికి సిద్ధంగా ఉండే అతికొద్ది మంది నటులలో రానా దగ్గుబాటి ఒకడు. మొదటి నుంచి విభిన్న కథలను ఎంచుకుంటూ అటు హీరోగా ఇటు క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినీరంగంలో తన కంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. ఈయన నటించిన లెటెస్ట్ చిత్రం ‘విరాటపర్వం’. గతేడాది ప్రథమార్థంలో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తుంది. అయితే కారోనా కారణంగా వాయిదా పడ్డ సినిమాలన్ని విడుదలై మంచి విజయాలను సాధించాయి. కానీ విరాట పర్వం మాత్రం ఇప్పటివరకు విడుదలకు నోచుకోలేకపోయింది. ఒకనొక సమయంలో ఈ చిత్రం నేరుగా ఓటీటీలోకి రానున్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఇటీవలే ఈ పుకార్లకు చెక్ పెడుతూ మేకర్స్ విడుదల తేదీని అనౌన్స్ చేశారు.
ఈ చిత్రాన్ని జూలై 1న విడుదల చేయనున్నట్లు మేకర్స అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం విరాట పర్వం ప్రీ పోన్ కానున్నట్లు తెలుస్తుంది. మొదటగా అనుకున్న తేదీకంటే ముందుగానే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారట. అన్ని కుదిరితే జూన్17న ఈ చిత్రం విడుదల కానుందని టాక్. దీనిపై చిత్రబృందం నుంచి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ఉత్తర తెలంగాణలో 1990లో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రంలో రానా నక్సలైట్ పాత్రలో నటించాడు. సాయిపల్లవి హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని శ్రీలక్ష్మీ వెంకటేశ్వరా సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించాడు.