Virata Parvam | భారీ ధరకు ‘విరాటపర్వం’ డిజిటల్ హక్కులు.. వామ్మో అన్ని కోట్లా?
Virata Parvam Digital Rights |ప్రస్తుతం తెలుగు ప్రేక్షకుల నోట వినిపిస్తున్న పేరు ‘విరాటపర్వం’. రానా దగ్గుబాటి, సాయిపల్లవి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. నీది నాది ఒకే కథ ఫేం వేణు ఊడుగుల దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి విశేష ఆధరణ వస్తుంది. రానా, సాయిపల్లవి నటనకు సినీప్రముఖులు సైతం మంత్ర ముగ్ధులయ్యారు. నక్సలిజం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా డిజిటల్ హక్కులు ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. కాగా నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఈ చిత్రాన్ని భారీ ధరకు విక్రయించినట్లు సమాచారం.
తాజాగా టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం విరాటపర్వం చిత్రాన్ని నెట్‌ఫ్లిక్స్ రూ.15 కోట్లకు విక్రయించినట్లు టాక్. ఈ చిత్రం విడుదలైన 50రోజుల తర్వాతే డిజిటల్లో విడుదల చేయాలని మేకర్స్ నెట్‌ఫ్లిక్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారట. ప్రేమ, విప్లవం వంటి అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రంలో రానా రవన్న పాత్రలో నటించగా.. సాయిపల్లవి వెన్నెల పాత్రలో నటించింది. ప్రియమణి, నవీన్ చంద్ర, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ సంస్థతో కలిసి సురేష్‌బాబు స్వీయ నిర్మాణంలో తెరకెక్కించాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Team India | దక్షిణాఫ్రికా పర్యటనకు భారత మహిళా క్రికెట్ జట్టు.. డిసెంబర్ 9న టూర్ షురూ..!
Almonds | రోజూ కొన్ని బాదంపప్పులను తినడం వల్ల శరీరంలో జరిగే మార్పులు ఇవే.. అధ్యయనాల్లో తేలిన నిజాలు..
Sheikh Hasina | తిరిగి రావడానికి కొత్త పాస్‌పోర్ట్ ఇవ్వండి.. బంగ్లాదేశ్‌ను కోరిన షేక్ హసీనా..!
కారేపల్లి ఎస్ఐగా రమేశ్ బాధ్యతలు స్వీకరణ
Raipur man jailed in Russia | ఉద్యోగం కోసం రష్యా వెళ్లిన వ్యక్తి.. డ్రగ్స్ కేసులో అరెస్ట్, ఆర్మీలో చేరాలని ఒత్తిడి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

