Matka | టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్ (Varun Tej) నటిస్తోన్న తాజా ప్రాజెక్ట్ మట్కా (Matka). పలాస 1978 ఫేం కరుణకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్లుగా నటిస్తున్నారు. 175 రోజుల తర్వాత కొత్త ఎనర్జీ, ఆశలతో జీవితానికి మట్కా రెట్రో మ్యాజిక్ అందించేందుకు సెట్స్‌లోకి తిరిగొచ్చాం.. అంటూ వరుణ్ తేజ్ ఇటీవలే వింటేజ్ టెలిఫోన్‌ను చేతులో పట్టుకున్న ఫొటోతో సినిమా అప్డేట్ అందించాడని తెలిసిందే.
తాజాగా మేకర్స్ మరో వార్తను మూవీ లవర్స్‌తో షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం రామోజీఫిలిం సిటీలో మట్కా మూడో షెడ్యూల్ కొనసాగుతోంది. ఈ షెడ్యూల్లో కీలక సన్నివేశాల చిత్రీకరణ కోసం ఆర్ఎఫ్సీలో ప్రొడక్షన్ టీం 1980 బ్యాక్‌డ్రాప్ వైజాగ్ లొకేషన్స్‌ను రీక్రియేట్ చేసినట్టు తెలియజేస్తూ మేకర్స్ స్పెషల్ గ్లింప్స్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఈచిత్రాన్ని వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే లాంఛ్ చేసిన మట్కా టైటిల్ టీజర్ సినిమాపై అంచనాలు పెంచుతూ సూపర్ బజ్ క్రియేట్ చేస్తోంది. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్లో సాగే కథతో వరుణ్ తేజ్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రాబోతుంది మట్కా. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ కథానుగుణంగా నాలుగు డిఫరెంట్ గెటప్స్లోకనిపించబోతున్నాడట. బాలీవుడ్ డ్యాన్సింగ్ క్వీన్ నోరాఫతేహి మట్కాలో మరో ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది.
The third schedule of #Matka is progressing in full swing in Hyderabad💥
Vintage locations of Vizag have been recreated on the magnificent sets at RFC to shoot key moments of the film❤️🔥
Mega Prince @IAmVarunTej @KKfilmmaker @Meenakshiioffl #NoraFatehi @gvprakash @SRTMovies pic.twitter.com/G6WWnysplj
— Vyra Entertainments (@VyraEnts) June 26, 2024