Vinayakan | ఒక్క సినిమా.. ఒకే ఒక్క పర్ఫెక్ట్ సినిమా చాలు.. సూపర్ స్టార్డమ్ సంపాదించడానికి.. అలాంటి సినిమానే జైలర్ (Jailer). తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ టైటిల్ రోల్లో నటించిన చిత్రం జైలర్. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించాడు. 2023లో వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ హిట్ లిస్టులో చేరిపోయింది. మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, జాకీ ష్రాఫ్ లాంటి స్టార్ యాక్టర్లు సిల్వర్ స్క్రీన్‌పై మెరిసి సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లారనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇంతకీ ఈ సినిమాతో సూపర్ పాపులారిటీ దక్కించుకున్నదెవరనే కదా మీ డౌటు. ఇందులో మెయిన్ విలన్ వర్మన్‌గా నటించిన వినాయకన్ (Vinayakan). ఈ సినిమాలో వర్మన్ది చాలా కీలకంగా సాగే మెయిన్ విలన్ పాత్ర. అయితే ఈ కేరళ యాక్టర్ జైలర్‌లో వర్మన్ పాత్ర కోసం కేవలం రూ.35 లక్షలు మాత్రమే రెమ్యునరేషన్ (Remuneration) తీసుకున్నాడంటూ మీడియాలో కథనాలు ఊపందుకున్నాయి. వీటిపై ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు వినాయకన్.
ఈ పుకార్లు పూర్తిగా నిరాధారమైనవని కొట్టిపారేశాడు. వాస్తవానికి రెమ్యునరేషన్ మొత్తం తప్పుగా చెప్పారని.. తాను దానికంటే మూడు రెట్లు ఎక్కువ ప్యాకేజీని అందుకున్నట్లు వినాయకన్ స్పష్టం చేశాడు. దీంతో రెమ్యునరేషన్‌పై వచ్చిన పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టేశాడు. జైలర్‌లో వినాయకన్ పక్కా ఊరమాస్ రోల్లో అదిరిపోయే విలక్షణ నటనతో టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచాడు. ఓ సీన్లో వర్మన్ బ్యాచ్ Taal Se Taal Mila పాటకు స్టెప్పులేసే వీడియో ఇండస్ట్రీ సర్కిల్లో దుమారం రేపుతున్న విషయం తెలిసిందే.
వర్మన్ గ్యాంగ్ డ్యాన్స్‌పై ఓ లుక్కేయండి మరీ..
Anirudh carried Jailer movie like a boss 🔥👌
But then, ARR came out of syllabus 🤏😎#Jailer #ARRahman #AnirudhRavichander #TaalseTaalmila pic.twitter.com/V5vtijDrpY
— Krishna Das (@KrishnaDasFB) August 22, 2023