కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram), కశ్మీర పరదేశి కాంబినేషన్లో వస్తున్న సినిమా ‘వినరో భాగ్యము విష్ణుకథ’ (Vinaro Bhagyamu Vishnu Katha). జీఏ2 పిక్చర్స్ పతాకంపై బన్నీవాసు నిర్మిస్తుండగా..నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. మురళీ కిషోర్ అబ్బురూ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సంబంధించి తాజా అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది.
విలేజ్ డ్రామా నేపథ్యంలో సాగనున్న ఈ సినిమా విడుదల తేదీపై రేపు క్లారిటీ ఇవ్వనున్నారు మేకర్స్. శనివారం సాయంత్రం 05:02 గంటలకు విడుదల తేదీని ప్రకటిస్తామని తెలియజేశారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఓ స్పెషల్ వీడియోను కూడా లాంఛ్ చేశారు. ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ చిత్రానికి చేతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు.
ఇటీవలే కిరణ్ అబ్బవరం నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అయితే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఆశించిన టాక్ తెచ్చుకోలేకపోయింది. తాజా చిత్రం వినరో భాగ్యము విష్ణుకథతో ఎలాగైనా హిట్టు కొట్టాలని చూస్తున్నాడు.
సినిమా రిలీజ్ డేట్ వీడియో..
The date is locked 🔒 for the release of #VinaroBhagyamuVishnuKatha ✨
Stay tuned…Announcement tomorrow @ 5:02 PM 💫#AlluAravind #BunnyVas @Kiran_Abbavaram@kashmira_9 @KishoreAbburu @chaitanmusic #MarthandaKVenkatesh @daniel_viswas @imsarathchandra @ItsChavan @GA2Official pic.twitter.com/GOAy9GXKpo
— GA2 Pictures (@GA2Official) October 28, 2022
Read Also : Mehreen Pirzada | ఐలాండ్‌లో విక్రాంత్‌తో మెహరీన్ ఫిర్జాదా.. కొత్త అప్డేట్ స్టిల్స్ వైరల్
Read Also : Harish Kalyan | జెర్సీ నటుడు హరీష్ కల్యాణ్ వెడ్డింగ్ డేట్, టైం వివరాలివే
Read Also : Balakrishna | సినిమాటిక్ స్టైల్లో నందమూరి బాలకృష్ణ తొలి కమర్షియల్ యాడ్.. వీడియో
Read Also : Black and white Teaser | హెబ్బా పటేల్ బ్లాక్ అండ్ వైట్ టీజర్
Read Also : Jyotika | 13 ఏండ్ల తర్వాత రీఎంట్రీ.. సెట్స్‌లో జ్యోతిక వీడియో వైరల్