Vikram ‘Cobra’ Movie Trailer date Announced | పేరుకు తమిళ హీరోనే అయినా తెలుగు హీరోలకు సమానంగా టాలీవుడ్లో క్రేజ్ సంపాదించుకున్న నటుడు విక్రమ్. సినిమా సినిమాకు వేరియేషన్‌ను చూపిస్తూ విలక్షణ నటుడుగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఈయన నటించిన ‘కోబ్రా’ విడుదలకు సిద్ధంగా ఉంది. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించిన ఈ సినిమా గతంలోనే షూటింగ్ పూర్తిచేసుకుంది. కానీ పోస్ట్ ప్రొడక్షన్ కారణంగా సినిమా విడుదల ఆలస్యమవుతూ వచ్చింది. ఈ చిత్రం సెప్టెంబర్ 31న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ క్రమంలో మేకర్స్ వరుస అప్డేట్లను ప్రకటిస్తున్నారు. తాజాగా మేకర్స్ మరో బిగ్ అప్డేట్ను ప్రకటించారు.
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కోబ్రా ట్రైలర్ డేట్‌ను మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ చిత్ర ట్రైలర్‌ను ఆగస్టు 25న విడదుల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రంలో విక్రమ్ సైటిస్టుగా ఏడు విభిన్న గెటప్స్‌లో విక్రమ్ కనిపించనున్నాడట. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన పోస్టర్లు, పాటలు సినిమాపై విపరీతమైన క్యూరియాసిటీని క్రియేట్ చేశాయి. ఈ చిత్రంలో విక్రమ్‌కు జోడీగా శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించింది. సెవెన్ స్క్రీన్ స్డూడియోస్ పతాకంపై ఎస్.ఎస్. లలిత్ కుమార్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించాడు. ప్రతినాయకుడి పాత్రలో ప్రముఖ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ నటించాడు. ఈ చిత్రానికి ఏఆర్. రెహమాన్ సంగీతం అందించాడు.
And it’s around the corner. #CobraTrailer #Cobra @AjayGnanamuthu @SrinidhiShetty7 @IrfanPathan @roshanmathew22 @7screenstudio @dop_harish #CobraFromAugust31 pic.twitter.com/de3wiP1D3A
— Chiyaan Vikram (@chiyaan) August 21, 2022