విక్రమార్కుడు 2 కథ రెడీ.. కానీ దర్శకుడు రాజమౌళి కాదు..

కొన్ని సినిమాలు ఎన్ని సంవత్సరాలైనా అలాగే ప్రేక్షకులు గుర్తుంచుకుంటారు. అలాంటి అదిరిపోయే కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ విక్రమార్కుడు. 2006 లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది. రవితేజ, అనుష్క జంటగా రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా దాదాపు 20 కోట్ల షేర్ వసూలు చేసి రవితేజ మార్కెట్‌ను రెండింతలు చేసింది. తర్వాత విక్రమార్కుడు సినిమాను తమిళం, కన్నడతో పాటు హిందీలో కూడా రీమేక్ చేశారు. అన్ని భాషల్లో ఈ సినిమా మంచి విజయం సాధించింది.

ఈ మధ్య 15 ఏళ్లు పూర్తి చేసుకున్న విక్రమార్కుడు గురించి ఈ సినిమా రచయిత విజయేంద్రప్రసాద్ పలు ఆసక్తికరమైన విషయాలు బయటపెట్టాడు. విక్రమార్కుడు సినిమాకు సీక్వెల్ చేయాలని తనకు ఎప్పటినుంచో ఉందని తన మనసులో మాట బయట పెట్టాడు విజయేంద్రప్రసాద్. అంతేకాదు దీనికోసం కథ కూడా సిద్ధం చేశానని చెప్పాడు. అన్నీ అనుకున్నట్లు జరిగితే వీలైనంత త్వరగా విక్రమార్కుడు 2 సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లాలని విజయేంద్రప్రసాద్ భావిస్తున్నాడు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఇచ్చాడు ఈయన. తాను రాసుకున్న విక్రమార్కుడు సీక్వెల్ కథకు దర్శకుడు రాజమౌళి కాదని తెలుస్తోంది. ఈ కథను మరో దర్శకుడు తెరకెక్కించబోతున్నాడు. రాజమౌళి తర్వాత సినిమా మహేశ్‌బాబుతో ఫిక్స్ అయింది. ఈ సమయంలో ఆయన ఇంకో సినిమాకు కమిట్ అవ్వడం కష్టమే. అందుకే విక్రమార్కుడు 2 కథ వేరే దర్శకుడు తీస్తున్నాడని తెలుస్తుంది. మరి ఈ సినిమాలో హీరోగా రవితేజ ఉంటాడా.. మరి ఎవరైనా వస్తారా అనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా రాజమౌళి లేని విక్రమార్కుడు 2 టాలీవుడ్లో హాట్ టాపిక్ అయింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
MAA Elections 2021 : ఎట్టకేలకు మా అధ్యక్ష ఎన్నికల తేదీలు ఖరారు.. మరి కండిషన్స్ ఏంటో తెలుసా !
సాయి ధరమ్ తేజ్ రిపబ్లిక్ సెన్సార్ పూర్తి.. టాక్ ఏంటో తెలుసా..?
Rashmika Mandanna : రహస్యాల్ని బయటపెట్టను!
Bigg Boss: కాజల్‌కి ఫుల్ క్లాస్ పీకిన ప్రియ..ఎందుకో తెలుసా?
Bigg Boss: ఈ వారం బెస్ట్, వరస్ట్ పర్ఫార్మర్స్ ఎవరో తెలుసా?
Idol Winner: ఇద్దరు భార్యలు,ఇద్దరు గార్ల్ ఫ్రెండ్స్‌ని సెట్ చేసుకున్న ఐడల్ విన్నర్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

