తెలుగు, తమిళంతోపాటు నార్తిండియా ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని హీరో విక్రమ్ (Vikram) ఈ టాలెంటెడ్ హీరో తాజాగా ‘కోబ్రా’ (Cobra) చిత్రంలో నటిస్తున్నాడు. అజయ్ జ్ఞానముత్తు (Ajay Gnanamuthu) దర్శకత్వం వహిస్తుండగా.. యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతోంది. ప్రమోషన్స్ లో భాగంగా విక్రమ్ టీం ఇవాళ హైదరాబాద్‌లో మీడియాతో చిట్ చాట్ చేసింది.
ఈ సందర్భంగా విక్రమ్ మాట్లాడుతూ..కోబ్రా సినిమా పూర్తి చేయడానికి మూడు సంవత్సరాలు పట్టింది. కోబ్రా కోసం ఎంత కష్టపడ్డామో ప్రేక్షకులు ఆగస్టు 31న చూస్తారు. సైకలాజికల్ థ్రిల్లర్, యాక్షన్ జోనర్లలో సినిమాలు తెరకెక్కించిన అజయ్ జ్ఞానముత్తు తనకు ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు అందించినందుకు ధన్యవాదాలు తెలియజేశాడు విక్రమ్. సినిమా మొత్తం తనకు సపోర్టు చేసిన శ్రీనిధి శెట్టి, మృణాళిని రవి, మీనాక్షికి ధన్యవాదాలు తెలిపాడు. విడుదల రోజు తాను హైదరాబాద్ వచ్చి తెలుగు ప్రేక్షకుల స్పందన చూడాలనుకుంటున్నానని చెప్పాడు. తిరుపతి ప్రసాద్‌తోపాటు మొత్తం చిత్రబృందానికి కృతజ్ఞతలు తెలిపాడు విక్రమ్.
ఈ చిత్రంలో కేజీఎఫ్ ఫేం శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) హీరోయిన్గా నటిస్తోండగా..మృణాళిని రవి, మీనాక్షి కీ రోల్స్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైనట్రైలర్కు మంచి స్పందన వస్తోంది. ట్రైలర్లో ఏఆర్ రెహమాన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తుందనిపిస్తోంది. కోబ్రాతో క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ తొలిసారి సిల్వర్ స్క్రీన్‌పై మెరవబోతున్నాడు.
ఈ చిత్రంలో రోషన్ మాథ్యూ, డైరెక్టర్ కేఎస్ రవికుమార్, మియా జార్జ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై ఎస్ఎస్ లలిత్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది.